Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సౌతాఫ్రికాకు వన్డే టీమ్ సెలక్షన్ : షమీకి పిలుపు.. రాహుల్ ఔట్

ఆదివారం, 24 డిశెంబరు 2017 (09:31 IST)

Widgets Magazine
team india

భారత క్రికెట్ జట్టు ఈనెలాఖరులో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులోభాగంగా, బీసీసీఐ సెలక్షన్ కమిటీ వన్డే జట్టును ప్రకటించింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లకు చోటుకల్పించారు. 
 
శ్రీలంకతో తలపడిన జట్టులో పెద్దగా మార్పులు చేయకుండానే వీరిద్దరికీ చోటు కల్పించారు. కాగా, వాషింగ్టన్ సుందర్, సిద్ధార్థ కౌల్‌లకు ఉద్వాసన తప్పలేదు. ఈ యేడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో షమీ, ఆగస్టు-సెప్టెంబరులో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో శార్దూల్ చివరిసారి ఆడారు.
 
వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, అజింక్యా రహానే ఓపెనర్లుగా వ్యవహరించనుండగా శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్‌లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. గాయంతో బాధపడుతూ వన్డే, టీ20 సిరీస్‌కు దూరమైన కేదార్ జాదవ్ తిరిగి జట్టులోకి తీసుకున్నారు. 
 
కాగా, దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌తు పరమ చెత్త రికార్డు ఉంది. దక్షిణాఫ్రికాలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు 28 సార్లు తలపడగా భారత్ కేవలం ఐదుసార్లు మాత్రమే విజయం సాధించింది. 21 సార్లు ఓటమి పాలైంది. తాజా సిరీస్‌లో భారత్ మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జనవరి 5న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
 
భారతజట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, అజింక్యా రహానె, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

లగ్జరీ కారులో అమ్మాయికి లిప్‌లాక్ కిస్ ఇస్తూ అడ్డంగా బుక్కైన క్రికెటర్

నాథన్ లియాన్. తన మణికట్టు మాయాజాలంతో తమ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన క్రికెటర్. వైవాహిక ...

news

టీ20ల్లో డబుల్ సెంచరీ ఆలోచన చేయడం అత్యాశే : రోహిత్ శర్మ

ఇండోర్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన రెండో ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ...

news

రోహిత్ శర్మ వీరబాదుడు... ట్వంటీ20 సిరీస్ భారత్ కైవసం

పర్యాటక శ్రీలంక జట్టుతో ఇండోర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత ...

news

ఇండోర్‌లో రోహిత్ శర్మ విశ్వరూపం

భారత క్రికెట్ జట్టు స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇండోర్ వేదికగా తన విశ్వరూపం ...

Widgets Magazine