ఒకే ఇన్నింగ్స్‌లో 11 పరుగులు, 10 వికెట్లు.. రాజ్ కుమార్ సింగ్ కొత్త రికార్డ్

vizag cricket stadium
Last Updated: గురువారం, 13 డిశెంబరు 2018 (13:57 IST)
ఒకే ఇన్నింగ్స్‌లో 11 పరుగులు ఇచ్చి, పది వికెట్లు సాధించి.. మణిపూర్‌కు చెందిన 18ఏళ్ల రెక్స్ రాజ్ కుమార్ సింగ్ రికార్డు సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో మూడు క్యాచ్‌లు, ఐదు బోల్ట్, 2 ఎల్‌డబ్ల్యూలతో పాటు పది వికెట్లు సాధించి.. 11 పరుగులకే ఇచ్చాడు. నాలుగు రోజుల పాటు జరిగే కూచ్ పెహర్ క్రికెట్ కప్‌ను గెలుచుకునేందుకు 19 ఏళ్ల క్రికెటర్లను ఎంపిక చేశారు. 
 
వీరిలో ఒకరే మణిపూర్‌కు చెందిన రాజ్ కుమార్ సింగ్ కూడా ఒకడు. ఇతను దేశవాళీ క్రికెట్‌లో అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన పోటీలో 9.5 ఓవర్లలో 11 పరుగులిచ్చి... ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లను కైవసం చేసుకున్నాడు. తద్వారా అరుణాచల్ ప్రదేశ్ జట్టు 19 ఓవర్లలో 38 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 
 
తదనంతరం 55 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన మణిపూర్ జట్టు 7.5 ఓవర్లలో వికెట్ లేమితో రాణించింది. తద్వారా అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై ధీటుగా రాణించడంలో రాజ్‌కుమార్ సింగ్ కీలక పాత్ర పోషించాడు.దీనిపై మరింత చదవండి :