బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (23:03 IST)

ఆరోజే ఐపీఎల్ 2024 ప్రారంభం.. తొలి మ్యాచ్ సీఎస్కేదే

Chennai Super Kings
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మే 22న ప్రారంభం కానుందని తెలుస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్- ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య తొలి మ్యాచ్ జరుగుతుందని తెలుస్తోంది. 
 
రిటెన్షన్, రిలీజ్‌డ్ లిస్టు పుణ్యమా అనే దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తిరిగి ముంబయి జట్టులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. 
 
ఇక ఆల్ క్యాష్ విధానంలో ప్లేయర్లు మార్చుకునేందుకు డిసెంబర్ 12 వరకు గడువు ఉంది. డిసెంబర్ 19న దుబాయి వేదికగా మినీ వేలం జరగనుంది.