శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 9 మే 2018 (10:20 IST)

ఐపీఎల్ 2018 : బట్లర్ మోత.. సొంతగడ్డపై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ముగుస్తున్నకొద్ది ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారుతోంది. లీగ్ ఆరంభం నుంచి వరుస పరాజయాలతో చతికిలపడుతూ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఆఖరులో పుంజుకుంది. ఆ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ పరుగు

ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ముగుస్తున్నకొద్ది ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారుతోంది. లీగ్ ఆరంభం నుంచి వరుస పరాజయాలతో చతికిలపడుతూ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఆఖరులో పుంజుకుంది. ఆ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ పరుగుల మోతకుతోడు బౌలర్ల సమయోచిత ప్రదర్శనతో తమకంటే మెరుగైన ప్రత్యర్థి పంజాబ్‌ కింగ్స లెవెన్ జట్టును కట్టడి చేసింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. మరోవైపు బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బందిపడిన పంజాబ్.. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక నాకౌట్ బెర్త్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకున్నది.
 
మంగళవారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఆ జట్టు ఆటగాడు బట్లర్ 58 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 82 పరుగులు చేయగా, రహానే 9, గౌతమ్ 8, శామ్సన్ 22, 14, బిన్నీ రనౌట్ 11, లోమ్రోర్ నాటౌట్ 9, ఆర్చర్ 0, ఉనాద్కట్ 0 చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో మూడు పరుగులు వచ్చాయి. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో స్టోయినిస్ ఒకటి, టై నాలుగు, ముజీబ్ రెండు వికెట్లు చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో రాహుల్ (నాటౌట్) 95, గేల్ 1, అశ్విన్ 0, కరణ్ నాయర్ 3, నాథ్ 9, తివారీ 7, అక్షర్ పటేల్ రనౌట్ 9, స్టోయినిస్ 11, టై నాటౌట్ 1 చొప్పున రన్స్, ఎక్స్‌ట్రాలు 7 పరుగులు వచ్చాయి. రాయల్స్ జట్టు బౌలర్లలో గౌతమ్ 2, ఆర్చర్, ఉనాద్కట్, స్టోక్స్, సోధీలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. పంజాబ్ జట్టులో రాహుల్ ఒంటరిపోరాటం చేసినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో ఓటమి చవిచూడక తప్పలేదు.