జలుబుకు విరుగుడు పెరుగు... ఎలా?

పెరుగు లేకుండా భోజనం ఊహించలేము. భోజనం ఆకర్లో ఒక ముద్ద పెరుగన్నం తింటే ఆరోగ్య సమస్యలు దగ్గరికి రావని ఆయుర్వేదం చెబుతోంది. ఆహార పదార్థాలలో దీనిని అమృతంతో పోలుస్తారు.

curd
kowsalya| Last Updated: మంగళవారం, 8 మే 2018 (10:51 IST)
పెరుగు లేకుండా భోజనం ఊహించలేము. భోజనం ఆకర్లో ఒక ముద్ద పెరుగన్నం తింటే ఆరోగ్య సమస్యలు దగ్గరికి రావని ఆయుర్వేదం చెబుతోంది. ఆహార పదార్థాలలో దీనిని అమృతంతో పోలుస్తారు. మన దేశంలో పెరుగు సంపూర్ణ ఆహారం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పెరుగు గురించి కొన్ని విషయాలు తెలిస్తే ఇష్టం లేని వారుకూడా తప్పక పెరుగు తింటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పెరుగు ఎలాంటి వాతవ్యాధినైనా నయం చేస్తుంది. బరువును పెంచుతుంది. జీలకర్ర పొడిని ఓ కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.
2. జలుబు చేస్తే పెరుగు తినకూడదంటారు కానీ జలుబుకు పెరుగే విరుగుడు.
3. ఇది మూత్రసంబంధ రోగాలకు, జిగురు విరేచనాలకు ఉత్తమం.
4. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండేవాళ్ళకు పెరుగు అమృతం వంటిది.
5. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే ఎపెండిసైటిస్ రాదు.
6. కామెర్లు వచ్చిన వారికి పెరుగు ఒక చక్కని ఔషధం. కామెర్లు వచ్చిన వారికి పెరుగు, మజ్జిక అధిక మెుత్తంలో ఆహారంగా ఇస్తూ దాంట్లో కొద్దిగా తేనే కూడా కలిపి ఇస్తే మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
7. కడుపులో అల్సర్ ఉండే వారిలో, గ్యాస్ట్రిక్ ఇరిటెషన్‌తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీతో బాధపడే వారికి పెరుగు అద్భుతమైన ఫలితాన్నిస్తుంది.
8. మలబద్ధకం సమస్య ఉన్న వారు రోజూ పెరుగుని, మజ్జిగను వాడటం మంచిది.
9. నిద్రపట్టని వారికి పెరుగు ఒక వరం లాంటిది. ఆయుర్వేదంలో గేదె పెరుగు పట్టని వారికి వాడటం మంచిది.
10. చర్మవ్యాధులు, చర్మ కాంతులకు పెరుగు, మజ్జిగ అమోగంగా పనిచేస్తుందని అంటారు.దీనిపై మరింత చదవండి :