శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 8 మే 2018 (10:35 IST)

పిస్తా పప్పుల్ని తీసుకుంటే గుండెకు మేలు..

పిస్తా పప్పుల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. ఉదాహరణకు 28 గ్రాముల పిస్తా పప్పులో శరీరానికి కావలసిన పీచు, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బీ6, మాంగనీస్ వంటివి పుష్కలంగా వుంటాయి. పిస్తా

పిస్తా పప్పుల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. ఉదాహరణకు 28 గ్రాముల పిస్తా పప్పులో శరీరానికి కావలసిన పీచు, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బీ6, మాంగనీస్ వంటివి పుష్కలంగా వుంటాయి. పిస్తాలో యాంటీ-యాక్సిడెంట్లు అధికంగా వుండటం ద్వారా అనారోగ్య సమస్యలను సునాయాసంగా అధిగమించవచ్చు.
 
పిస్తాలో గుండెకు మేలు చేసే కొవ్వు వుంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండె వ్యాధులను దరిచేరనివ్వదు. ఇంకా మానసిక ఒత్తిడితో వచ్చే రక్తపోటును పిస్తా పప్పులు నియంత్రిస్తాయి. అలాగే రక్తనాళాల్లో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పిస్తా పప్పులను తీసుకుంటే శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది హార్మోన్ల సంఖ్యను పెంచి, గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా వుంచుతుంది. పిస్తాలోని పీచు జీర్ణ సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. 
 
ఇంకా పేగుల్లో వున్న బ్యాక్టీరియాపై పోరాడేందుకు పిస్తాలోని పీచు ఉపయోగపడుతుంది. రోజుకు ఐదు పిస్తా పప్పుల్ని తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మహిళలు గర్భకాలంలో పిస్తా పప్పుల్ని తీసుకోవడం ద్వారా శరీరానికి తగిన పోషకాలను అందించినట్లవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.