శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (14:18 IST)

ఐసీసీ ట్వంటీ20 వరల్డ కప్ మ్యాచ్ : భారత్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ

rohith sharma
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బుధవారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‍లో టాస్ ఓడిపోయిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. 
 
కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ తుది దట్టులో మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో అక్షర్ పటేల్ స్థాంలో అదనపు బ్యాటర్‌గ దీపక్ హుడాను ఆడించిన భారత్.. ఇపుడు అతన్ని తొలగించి, తిరిగి అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. 
 
అలాగే, గత మ్యాచ్‌లో వెన్ను నొప్పికి గురైన సీనియర్ కీపర్ దినేశ్ కార్తీక్ కోలుకోవడంతో అతన్ని జట్టులో కొనసాగించింది. అతని స్థానంలో జట్టులోకి రావాలని ఆశించిన యువ క్రికెటర్ రిషబ్ పంత్ మరోమారు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. 
 
ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్... కేవలం 2 పరుగులు మాత్రమే చేసి తన వికెట్‌ను యాసిర్ అలీకి సమర్పించాడు. ప్రస్తుతం క్రీజ్‌లో రాహుల్ (43), కోహ్లీ (23) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ స్కోరు 8.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది.