ధోనీ బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం.. మూడు ఫోన్లు మాయం..

ఆదివారం, 19 మార్చి 2017 (11:16 IST)

ms dhoni

హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి టీమిండియా క్రికెటర్ ధోనీ తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ధోనీ వద్దనున్న మూడు ఫోన్లు అపహరణకు గురయ్యాయి. ధోనీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఉదయం ధోనీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా హోటల్‌లో దట్టంగా పొగలు వ్యాపించాయి. 
 
జార్ఖండ్ టీమ్‌కు, తమిళనాడు టీమ్‌కు మధ్య జరగనున్న విజయ్ హజారే ట్రోపీ టోర్నమెంట్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ధోనీ ఆ హోటల్‌లో బస చేశాడు. ధోనీ వెంట దినేష్ కార్తీక్ కూడా ఉన్నాడు. హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చెందిన మొబైల్ ఫోన్లు పోయాయి. దీంతో అతను ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో జార్ఖండ్ క్రికెటర్‌కు చెందిన మూడు ఫోన్లు పోయాయి. దీనిపై ఆయన ద్వారకా సెక్టార్ 10 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

రాంచీ టెస్టు.. స్మిత్ రివ్యూ.. 40 ఓవర్లలో 120 పరుగులు సాధించిన టీమిండియా

రాంచీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు భారత్ ఒక వికెట్ కోల్పోయి 120 ...

news

ఇషాంత్ ఫేస్ గేమ్ ఛాలెంజ్: బీసీసీఐ సవాల్‌కు అనూహ్య స్పందన.. హ్యాష్‌ట్యాగ్‌ కూడా?

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో డీఆర్ఎస్ వివాదం మ్యాచ్ కంటే ...

news

ధోనీ బసచేసిన ఢిల్లీ హోటల్‌లో అగ్నిప్రమాదం.. కిట్ బూడిదైపోయింది.. మ్యాచ్ రద్దు..?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలో సెమీఫైనల్ ...

news

ఐసీసీకి శశాంక్ మనోహర్ రాజీనామా.. ట్విట్టర్లో రచ్చ రచ్చ..

ఐసీసీ ఛైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 59 ఏళ్ల మనోహర్ కేవలం ...