ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (11:21 IST)

కెప్టెన్ కూల్ మాటల్ని ఎప్పటికీ మరిచిపోలేను... హార్దిక్ పాండ్యా

hardik pandya
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పై ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రశంసల జల్లు కురిపించారు. తాను క్రికెటర్‌గా నిలదొక్కుకోవడానికి కెప్టెన్‌ కూల్‌ అందించిన సహకారం చాలా గొప్పదన్నారు. ప్రపంచ కప్ జరుగనున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. క్రికెట్‌ తనకెంతో ముఖ్యమైందని, కెప్టెన్‌ కూల్‌ చెప్పిన ఓ మాట ఎప్పటికీ మర్చిపోలేనని వీడియోలో తెలిపాడు. 
 
జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అనుకున్నప్పుడు క్రికెట్ ను ఎంచుకున్నానని..  క్రికెటర్‌ కావడమే లక్ష్యంగా అనుకున్న సమయంలో.. ధోనీ ఓసారి తనతో అన్న మాటలు తనకెప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చాడు. ఆడేటప్పుడు తానొక్కడి కోసం కాకుండా.. జట్టు కోసం ఆడాలని ధోనీ చెప్పాడని.. స్కోర్ బోర్డును గమనించి ఆట ఆడాలని చెప్పేవాడని హార్దిక్ తెలిపాడు. 
 
కాగా గాయం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత ఈ ఆల్‌రౌండర్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు పాండ్యా. గత సీజన్‌లో భారత టీ20 లీగ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి గుజరాత్‌ టైటిల్‌ను అందుకున్నాడు. ఆసియాకప్‌లోనూ తన ఆటతీరుతో మెరిశాడు.