గురువారం, 2 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (08:02 IST)

ధోనీ మోకాలికి శస్త్రచికిత్స.. సర్జరీ విజయవంతం

Dhoni
చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మోకాలికి శస్త్రచికిత్స చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌లు మోకాలి గాయంతోనే ఆడిన ధోనీ ఫైనల్ ముగిసిన తర్వాత చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ముంబైలోకి కోకిలా బెన్ ఆస్పత్రిలో ధోనీ ఎడమ మోకాలికి నేడు శస్త్రచికిత్స చేశారు. 
 
బీసీసీఐ వైద్య నిపుణుడు డాక్టర్ దిన్ షా పార్దీవాలా ఈ శస్త్రచికిత్సను పర్యవేక్షించారు. ఈ సర్జరీ విజయవంతం అయిందని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈవో విశ్వనాథన్ వెల్లడించారు. ధోనీ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, మరో రెండ్రోజుల్లో డిశ్చార్జి అవుతాడని చెప్పారు. 
 
ప్రస్తుతం ధోనీకి విశ్రాంతి చాలా అవసరమని.. ఆయన పూర్తిగా కోలుకున్నాక క్రికెట్ మైదానంలోకి దిగుతాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.