సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

బంగ్లాదేశ్ క్రికెటర్ల వీరకుమ్ముడు.. లంకేయుల చిత్తుచిత్తు

సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు ట్వంటీ20 టోర్నీలో ఆతిథ్య శ్రీలంక జట్టు చిత్తుగా ఓడింది. క్రికెట్ పసికూన బంగ్లాదేశ్ క్రికెటర్ల వీరకుమ్ముడు ధాటికి లంకేయులు చేతులెత్తేశారు. ఫలితంగా బంగ్లాదేశ్ జట్టు 5 విక

సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు ట్వంటీ20 టోర్నీలో ఆతిథ్య శ్రీలంక జట్టు చిత్తుగా ఓడింది. క్రికెట్ పసికూన బంగ్లాదేశ్ క్రికెటర్ల వీరకుమ్ముడు ధాటికి లంకేయులు చేతులెత్తేశారు. ఫలితంగా బంగ్లాదేశ్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
కాగా, ఈ టోర్నీలో భాగంగా, ఆదివారం కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియం వేదికగా శ్రీ‌లంక - బంగ్లాదేశ్ జట్ల మధ్య ట్వంటీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 
 
దీంతో శ్రీ‌లంక బ్యాటింగ్‌కు దిగింది. బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీ‌లంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌కుగాను 6 వికెట్లు కోల్పోయి 214 ప‌రుగులు చేసింది. కుశాల్ (74), మెండిస్ (57) రాణించగా.. మ్యాచ్ ఆఖరులో తరంగ (32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
 
అనంతరం 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. అత్యుత్తమ బ్యాటింగ్‌తో విక్టరీని సొంతం చేసుకుంది. తమిమ్ (47), లిట్టన్ (43) శుభారంభం అందించగా.. రహీమ్ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా 19.4 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది.