శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (11:35 IST)

విదేశీ పర్యటనలకు భార్యలను తీసుకెళ్లాలి.. కోహ్లీ అభ్యర్థనపై సీఓఏ ఏమంది?

భారత క్రికెటర్లకు గతంలో బీసీసీఐ షాకిచ్చిన సంగతి తెలిసిందే. విదేశాల్లో క్రికెట్‌ సిరీస్‌లకు టీమిండియా క్రికెటర్లు తమ భార్యలతో వెళ్లడం పరిపాటి. కానీ ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత ఆటగాళ్లు తమ భార్య

భారత క్రికెటర్లకు గతంలో బీసీసీఐ షాకిచ్చిన సంగతి తెలిసిందే. విదేశాల్లో క్రికెట్‌ సిరీస్‌లకు టీమిండియా క్రికెటర్లు తమ భార్యలతో వెళ్లడం పరిపాటి. కానీ ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత ఆటగాళ్లు తమ భార్య, ప్రియురాళ్లకు దూరంగా ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. కనీసం నెల రోజులపాటు తమ జీవిత భాగస్వామి, స్నేహితురాళ్లకు దూరంగా ఉండాలని సూచించింది. 
 
చాలా సందర్భాల్లో ఆటగాళ్ల వైఫల్యాలకు వారి కుటుంబ సభ్యులే కారణమంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కోహ్లీ వైఫల్యానికి అనుష్క, ధోనీ వైఫల్యానికి సాక్షి కారణమంటూ గతంలో విమర్శలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో భారత జట్టు విదేశీ సిరీస్‌ల కోసం వెళ్లినప్పుడు పర్యటన మొత్తం ఆటగాళ్లతో వారి భార్యలు ఉండేలా అనుమతించాలంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన అభ్యర్థనపై తక్షణమే ఓ నిర్ణయానికి రాలేమని క్రికెట్ పాలకుల కమిటీ తెలిపింది.
 
ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో రెండు వారాలు మాత్రమే ఆటగాళ్ల వెంట భార్యలు ఉండేలా అనుమతిస్తున్నారు. కానీ తక్షణమే నిర్ణయం తీసుకోలేం.. ఈ విషయంపై పూర్తిగా అధికారాన్ని కొత్తగా ఏర్పడే బీసీసీఐ కార్యవర్గానికే వదిలేస్తున్నట్లు సీఓఏ తెలిపింది.