శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (13:34 IST)

ఆ విషయంలో డాన్ బ్రాడ్‌మన్ తర్వాత విరాట్ కోహ్లీనే...

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో వేగంగా సెంచరీలు చేసిన ఘనత ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రాడ్‌మెన్ పేరిట ఉంది. అతని తర్వాత విరాట్ కో

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో వేగంగా సెంచరీలు చేసిన ఘనత ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రాడ్‌మెన్ పేరిట ఉంది. అతని తర్వాత విరాట్ కోహ్లీ చేరాడు. బ్రాడ్‌మెన్ 66 ఇన్నింగ్స్‌లలో 24 సెంచరీలు చేస్తే.. విరాట్ కోహ్లీ 123 ఇన్నింగ్స్‌లలో 24 సెంచరీలు చేయడం విశేషం.
 
ఇకపోతే, ఇపుడు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. ఫలితంగా మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 24వ సెంచరీ. 72వ టెస్ట్ ఆడుతున్న కోహ్లీ ఖాతాలో 24 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను కోహ్లీ అధిగమించాడు. 
 
టెస్టుల్లో స్మిత్ 6199 పరుగులు చేయగా.. ఇప్పుడు కోహ్లీ అతన్ని వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం విరాట్ 6250 పరుగులతో ఉన్నాడు. సౌతాఫ్రికాతో మార్చిలో జరిగిన కేప్‌టౌన్ టెస్ట్ తర్వాత స్మిత్ తన టీమ్‌కు ఆడలేదు. బాల్ టాంపరింగ్ ఆరోపణలతో ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.