గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (14:22 IST)

పుజారా..61 బంతుల్లో 100 పరుగులు చేసాడా..నిజమేనా??

ప్రస్తుత భారత క్రికెట్ టెస్ట్ జట్టులో మిస్టర్ డిపెండబుల్‌గా నిలిచిన ఛటేశ్వర్ పుజారా ఒక అద్భుతమైన టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. చాలా నెమ్మదిగా ఆడతాడు. క్రీజులో నిలబడి గంటలకొద్దీ బ్యాటింగ్ చేస్తాడు. వికెట్లకు అడ్డుగోడలా నిలబడతాడు. ప్రత్యర్థి బౌలర్లు సైతం నువ్వు ఎప్పుడు అవుట్ అవుతావు అని అడిగేంతలా వారి సహనానికి పరీక్ష పెడతాడు. 
 
అలాంటి పుజారా తనలోని టీ20 బ్యాట్స్‌మెన్‌ను నిద్రలేపాడు. టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర జట్టు రైల్వేస్‌తో తలపడిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన పుజారా కేవలం 61 బంతుల్లోనే 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం 20 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో పుజారా టెస్ట్‌లకు మాత్రమే పనికొస్తాడు అనే అపోహను పటాపంచలు చేసాడు. 
 
అవసరానికి తగినట్లు తాను ఏ ఫార్మాట్‌లోనైనా రాణించగలనని నిరూపించుకున్నాడు. నిజానికి టెస్ట్ బ్యాట్స్‌మెన్ అనే ముద్రపడడం వల్లే అతడిని ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీ టీమ్‌లోకి తీసుకోలేదు.