శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 నవంబరు 2017 (11:34 IST)

మైదానంలో ఆటగాళ్లు పాదరసంలా కదిలారు.. రవిశాస్త్రి

తిరువనంతపురం వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేన గెలుపొందడానికి గల కారణాలని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు.

తిరువనంతపురం వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేన గెలుపొందడానికి గల కారణాలని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. గతంతో ఎన్నడూ కివీస్‌పై టీ20 మ్యాచ్‌ను గెలవని టీమిండియా... ఇప్పుడు ఏకంగా సిరీస్‌ను కైవసం చేైసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశాడు.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత కుర్రోళ్లు పాదరసంలా కదిలారన్నారు. ఫలితంగా భారత్ నిర్ధేశించిన లక్ష్యం చిన్నదైనప్పటికీ ప్రత్యర్థి జట్టు విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిందన్నారు. 
 
ముఖ్యంగా, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా తెలివైన ఆటగాడని... ప్రత్యర్థి జట్టుకు ఏ అవకాశాన్నీ ఇవ్వలేదని కొనియాడాడు. చివరి టీ20లో బుమ్రా 9 పరుగులకు 2 వికెట్లను కూల్చిన విషయాన్ని శాస్త్రి గుర్తుచేశాడు. 
 
భారత ఇన్నింగ్స్ ముగిశాక... ఆ స్కోరును కాపాడుకోగలమనే భావించామని చెప్పాడు. 8 ఓవర్ల ఈ మ్యాచ్‌లో కేవలం 2 లేదా 3 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపం మారిపోయే అవకాశం ఉంటుందన్నాడు. అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ, పరుగులను నియంత్రించడంలో కోహ్లీ సేన సఫలమైందని చెప్పాడు.