Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇండోర్‌లో రోహిత్ శర్మ విశ్వరూపం

శనివారం, 23 డిశెంబరు 2017 (08:52 IST)

Widgets Magazine
rohit sharma

భారత క్రికెట్ జట్టు స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇండోర్ వేదికగా తన విశ్వరూపం ప్రదర్శించాడు. శ్రీలంకతో శుక్రవారం ఇండోర్ వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. ఫలితంగా కేవరం 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. తన ఊచకోతతో టి20ల్లో వేగవంతమైన సెంచరీని సమం చేశాడు. వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో విఫలమై రెండో మ్యాచ్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన హిట్‌మ్యాన్‌… దానిని టి20 సిరీస్‌లోనూ రిపీట్ చేశాడు. కటక్‌లో రాణించలేకపోయినప్పటికీ ఇండోర్‌లో విశ్వరూపం చూపాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
 
టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేశాడు రోహిత్‌ శర్మ. 35 బంతుల్లో సెంచరీ చేరుకున్న అతడు.. దక్షిణాఫ్రికా క్రికెటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ పేరిటున్న రికార్డు (2017లో బంగ్లాదేశ్‌పై)ను సమం చేశాడు. 23 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన రోహిత్‌.. మరో 12 బంతుల్లోనే సెంచరీకి దూసుకెళ్లాడు. సెంచరీ చేరుకునే క్రమంలో అతడు 11 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో మొత్తం 12 ఫోర్లు, 10 సిక్సర్లున్నాయి. ఫోర్లు, సిక్సర్ల ద్వారానే అతడు 108 పరుగులు చేయడం విశేషం. అతడి పరుగుల్లో ఇవి 91.52 శాతం. ఇదీ రికార్డే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్ : బాలీవుడ్ ట్యూన్స్‌కు చిందేసిన కోహ్లీ - అనుష్క (వీడియో)

నూతన దంపతులైన విరాట్ కోహ్లీ - అనుష్క జోడీ ఆనందంలో మునిగిపోయింది. వివాహ మధురానుభూతిని ...

news

నేడు లంకతో రెండో టీ20 ... సిరీస్‌పై కన్నేసిన భారత్

మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ ...

news

విరాట్ - అనుష్కల పెళ్లి రిసెప్షన్‌లో ప్రధాని మోడీ సందడి

ఇటీవల పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క వివాహ రిసెప్షన్ కుటుంబ సభ్యులు, స్నేహితుల ...

news

మోదీని కలిసిన విరుష్క జంట... ద్యాముడా... కామెంట్లు దంచేస్తున్నారుగా....

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విరుష్క జంట కలిసి పెళ్లి విందు ఆహ్వాన పత్రిక వున్న బ్యాగును ...

Widgets Magazine