మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (20:51 IST)

గోల గోల చేసిన కంగారూ ఆటగాళ్లు.. బూటులో కూల్‌డ్రింక్స్? (video)

Shoes
తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ముద్దాడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు దుబాయ్‌ మైదానంలో గెలుపు సంబరాలు చేసుకున్నారు. తుదిపోరులో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 18.5 ఓవర్లలోనే ఛేధించింది. దీంతో కంగారూ ఆటగాళ్లు ఆనందంలో మునిగితేలారు. 
 
సౌథీ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌ (28 నాటౌట్‌) బౌండరీ బాదగానే మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన ఆటగాళ్లు ఒకరినొకరు ఆలింగనాలు చేసుకొని సంబరపడ్డారు. తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో గోల గోల చేశారు. 
 
ఈ క్రమంలోనే ఆసీస్‌ కీపర్‌ మాథ్యూవేడ్‌, ఆల్‌రౌండర్‌ స్టోయినిస్‌ ఒక బూటులో శీతల పానీయం పోసుకొని తాగారు. గెలుపు సంబరాల్లో భాగంగా వారిద్దరూ ఇలా చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.