Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సచిన్‌ను తొలిసారి ఇంటర్వ్యూ చేసిన స్పోర్ట్స్ జర్నలిస్టు ఇకలేరు..

శనివారం, 30 సెప్టెంబరు 2017 (09:05 IST)

Widgets Magazine
tom alter

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను తొలిసారి ఇంటర్వ్యూ చేసిన స్పోర్ట్స్ జర్నలిస్టు టామ్ అల్టెర్ ఇకలేరు. ఆయన వయసు 67 యేళ్లు. సినిమా, టెలివిజన్, థియేటర్ సీనియర్ నటుడిగా రాణించి, పద్మశ్రీ అవార్డు అందుకున్న టామ్ అల్టెర్ స్టేట్ - ఫోర్ చర్మ కేన్సర్‌తో  బాధపడుతూ, శుక్రవారం రాత్రి ఆయన నివాసంలోనే కన్నుమూశారు. ఈయనకు భార్య కరోల్, కుమారుడు జామీ, కుమార్తె అఫ్షాన్ ఉన్నారు. 
 
1980లలో స్పోర్ట్స్ జర్నలిస్టుగానూ పనిచేసిన మూడు పుస్తకాలు కూడా రాశారు. 300కుపైగా సినిమాల్లో నటించారు. పలు టీవీ షోలలోనూ నటించిన ఆయన దర్శకత్వంలోనూ ప్రతిభ చాటారు. టీవీ కోసం సచిన్ టెండూల్కర్‌ను తొలిసారి ఇంటర్వ్యూ చేసింది టామ్‌నే. 2008లో ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పౌర పురస్కారంతో గౌరవించింది.
 
బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన టామ్ మరణంతో తమ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. భారత్‌లో మూడోతరం అమెరికన్ అయిన టామ్ 1950లో హిల్‌స్టేషన్‌ అయిన ముస్సోరీలో జన్మించారు. పుణెలోని ప్రఖ్యాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌లో చేరి గోల్డ్ మెడల్ సంపాదించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

భారత్‌తో నాలుగో వన్డే.. గెలుపొందిన ఆస్ట్రేలియా.. కోహ్లీసేనకు షాక్..

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్ జట్టు విజయం సాధించింది. బెంగళూరు ...

news

చిక్కుల్లో బెన్ స్టోక్స్... ఒక నిమిషంలో 15 పిడిగుద్దులు (వీడియో)

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చిక్కుల్లో పడ్డాడు. బిస్ట్రల్‌లో సోమవారం ఒక పబ్‌లో ...

news

స్టేడియంలో అనుచిత ప్రవర్తన.. రెడ్ కార్డ్ అమలు.. భలే నిర్ణయమన్న సౌరవ్ గంగూలీ

క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా.. ఇతర క్రీడాకారులపై అనుచిత ప్రవర్తనకు పాల్పడితే ...

news

ఆటగాళ్లూ జాగ్రత్త!.. దురుసుగా ప్రవర్తిస్తే రెడ్‌కార్డే...

అంతర్జాతీయ క్రికెట్ నియమనిబంధనలను ఐసీసీ మరోసారి సవరించింది. పాతవాటిలో కొన్ని మార్పులు ...

Widgets Magazine