సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 22 నవంబరు 2023 (09:27 IST)

పెళ్లి పీటలెక్కనున్న వెంకటేష్ అయ్యర్ - కాబోయే భార్య చేస్తున్నారో తెలుసా?

venkatesh iyer
భారత యువ సంచలనం, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈయన త్వరలలోనే వివాహం చేసుకోబోతున్నారు. తనకు కాబోయే భార్య శృతి రఘునాథ్ మంగళవారం ఆయన వివాహం నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ విషయాన్ని వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్ మూడు ఫొటోలను షేర్ చేశాడు. 
 
ఫొటోల్లో కాబోయే దంపతులు చూడముచ్చటగా కనిపించారు. ఇక కాబోయే భార్య శృతి రఘునాథన్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో మాస్టర్స్ చేసింది. బెంగళూరులోని ఓ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో పనిచేస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఎంగేజ్‌మెంట్ సందర్భంగా వెంకటేష్ అయ్యరు పలురువు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, అర్షదీప్ సింగ్‌తో పాటు పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
 
కాగా వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి అనతికాలంలో మంచి పాపులారిటీ సంపాదించాడు. ఆల్ రౌండర్‌గా రాణిస్తుండడంతో చక్కటి గుర్తింపు దక్కింది. తక్కువ కాలంలోనే టీమిండియాలో చోటుకూడా సంపాదించాడు. 2021 ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా ఆడి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. పది మ్యాచ్‌లలో 41.11 సగటుతో 370 పరుగులు చేయడంతో అతడి ప్రతిభ బయటపడింది. 2023 ఐపీఎల్ మినీ వేలంలో వెంకటేష్ అయ్యర్ రూ.8 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. 
 
ఒక సెంచరీ, రెండు అర్థ సెంచరీలతో 14 మ్యాచ్‌ల్లో 404 పరుగులు చేశాడు. 2024 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా జట్టు అయ్యర్‌ను 2023 మినీ వేలంలో రూ.8 కోట్ల భారీ ధరకు వెంకటేశ్ అయ్యర్ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో 14 మ్యాచ్‌లలో 404 పరుగులు చేశాడు. 2024 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా జట్టు అయ్యర్ను కోల్‌కతా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వెంకటేష్ భారత్ తరపున తరపున ఇప్పటివరకు 9 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. చివరగా గత ఏడాది ఫిబ్రవరిలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.