బుధవారం, 9 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 7 ఏప్రియల్ 2025 (10:59 IST)

Vijay: రష్మిక మందన్న బర్త్ డే వేడుకను ఓమన్ లో జరిపిన విజయ్ దేవరకొండ !

Rashmika- Vijay at Oman
Rashmika- Vijay at Oman
రష్మిక మందన్న బర్త్ డే తర్వాత రోజే సోషల్ మీడియాలో విజయ్, రష్మిక ఫొటోలను పోస్ట్ చేశారు. ఇద్ద‌రు ఒమ‌న్ వెళ్లిన‌ట్టు ఫొటోలను బట్టి తెలుస్తోంది. ఓమన్ షేక్ డ్రెస్ లో విజయ్ నడుచుకుంటూ, గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించగా, రష్మిక అక్కడే సముద్ర ఒడ్డున కూర్చున్న ఫొటోలను షేర్ చేసింది. అయితే ఇద్దరూ కలిసి కాకుండా విడివిడిగా వున్నట్లు భ్రమించేలా ఫొటోలో ప్రేమ్ లో పెట్టి విజయ్ టీమ్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
 
Vijay devarkonda- horse
Vijay devarkonda- horse
ఇప్పటివరకు వీరి ప్రేమపై రకరకాల వార్తలు వస్తున్నా ఖండిచపోగా మరింతలా ఫ్యాన్స్ కు చేరువయ్యేలా ఏదో సందర్భంలో ఫొటోలు పోస్ట్ చేస్తూ వున్నారు. ఇక రష్మిక తెలుగులో ది గాళ్ ఫ్రెండ్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ పాటలో గళం కలిపాడు కూడా. మరోవైపు ఆమె  బాలీవుడ్ సినిమాల్లో బిజీగా వుంది.  మరి విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ మళ్ళీరావా సినిమాల ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కలయికలో కింగ్‌డమ్ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాలో విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.