రిజ్వాన్ అతిప్రేమ.. నవ్వుకున్న జనం.. ఏమైందంటే? (video)
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ అతిప్రేమ చూపెట్టాడు. ఇది పాక్ అభిమానులకు ముచ్చటగా ఉన్నా... ఇతరులకు అతిగా అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
పాకిస్తాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ నౌమన్ అలీ బౌలింగ్ చేస్తున్నాడు. అతడు వేసిన ఓ బంతి లబుషేన్ మోచేతిని తాకింది. కీపింగ్ చేస్తున్న రిజ్వాన్ బంతిని అందుకోకుండా... లబుషేన్ దగ్గరకు వెళ్లి బాగున్నావా అంటూ ఆరా తీశాడు. అనంతరం అతడి మోచేతిని పట్టుకొని రుద్దాడు కూడా.
అయితే ఇక్కడ రిజ్వాన్ చేసిన పనిని తప్పు బట్టడం లేదు. అక్కడ అతడు ప్రదర్శించిన అత్యుత్సాహం నవ్వు తెప్పించేదిలా ఉంది. బంతిని ఫాస్ట్ బౌలర్ వేయలేదు... అయినప్పటికీ రిజ్వాన్ లబుషేన్ చేతిన తన చేతుల్లోకి తీసుకుని అతి జాగ్రత్త చేయడం విడ్డూరంగా అనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది.