శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : బుధవారం, 3 జులై 2019 (14:10 IST)

ప్రపంచ కప్ ఆడాలనే కోరికను 15 యేళ్లకు నెరవేర్చుకున్న క్రికెటర్ ఎవరు?

ప్రపంచ కప్‌ ఆడాలనే కోరికను ఆ క్రికెటర్‌కు 15 యేళ్ల తర్వాత తీరింది. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. దినేష్ కార్తీక్. 2004లో లార్డ్స్ మైదానంలో తొలి వన్డే మ్యాచ్ ఆడిన డీకే... ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌ను కూడా ఇంగ్లండ్ గడ్డపై ఉన్న ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆడాడు. అయితే, ఒత్తిడిని తట్టుకోలేక కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 
 
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ పోటీల కోసం ప్రకటించిన టీమిండియాలో ఈసారి రిజర్వ్‌ కీపర్‌గా దినేష్ కార్తీక్‌కు జట్టులో చోటుదక్కింది. అయితే, ఈ టోర్నీలో భారత్‌ ఆడిన ఎనిమిదో మ్యాచ్‌లో జాదవ్‌ స్థానంలో బరిలోకి దిగాడు. 
 
కానీ, నాలుగో నెంబర్‌లో అతడిని తీసుకున్నా మ్యాచ్‌ పరిస్థితిని బట్టి 45వ ఓవర్‌లో ఆరో నెంబర్‌లో ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒత్తిడిని తట్టుకోలేక అతడు 8 పరుగులకే వెనుదిరిగాడు. 2007 ప్రపంచక్‌పలో కార్తీక్‌ తొలిసారి చోటు దక్కించుకున్నప్పటికీ ఆ టోర్నీ మొత్తం రిజర్వు బెంచీకే పరిమితమయ్యాడు.