మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Modified: బుధవారం, 10 జులై 2019 (21:09 IST)

ముద్దు పెట్టుకున్న ధోనీ బ్యాట్ హ్యాండిచ్చింది... ధోనీ భార్య సాక్షి కన్నీటి పర్యంతమైంది...

ధోనీ.... లక్ష్యం కొండంత వుండు గాక. జట్టును విజయ తీరాలకు చేర్చుతాడనే కొండంత ధైర్యం. అలాంటి ధైర్యమే సెమీఫైనల్స్ లోనూ కనిపించింది ఇండియన్ క్రికెట్ అభిమానులకు. ఒకవైపు టాపార్డర్ వికెట్లు టపాటపా ఒక్కొక్కరు ఒక్కో పరుగు చేసి ఔటవడంతో ఇక భారత్ పని అయిపోయినట్లే అనుకున్నారంతా.

అసలు 100 పరుగుల లోపే అంతా ఆలౌట్ అనుకున్న తరుణంలో భారత్‌ను పాండ్యా, పంత్ ఆదుకున్నారు. ఐతే న్యూజీలాండ్ బౌలర్లు భారత్ బ్యాట్సమన్లపై విజృంభించడంతో 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. 
 
ఆ సమయంలో ధోనీ- జడేజాలా జోడీ నిలదొక్కుకున్నారు. జడేజా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ వుండటంతో ఇక భారత్ గెలుపు ఖాయం అనుకున్నారంతా. ఆ దశలో 77 పరుగులు వద్ద జడేజా దురదృష్టవశాత్తూ అవుటయ్యాడు. ఆ దశలో ధోనీ వుండటంతో ఇంకా ఏదో ఆశ అలానే నిండి వుంది. చివరి 2 ఓవర్లు మిగిలి వున్నాయి. 49వ ఓవర్ తొలి బంతిని ధోనీ సిక్స్ కొట్టడంతో ఇక భారత్ గెలుపు ఖాయం అనుకున్నారంతా. ఐతే అదే ఓవర్ మూడో బంతిని కొట్టిన ధోనీ రెండో పరుగు కోసం ప్రయత్నించి గుప్టిల్ విసిరిన డైరెక్ట్ త్రోకి చిక్కాడు. 
 
ధోనీ బ్యాట్ జస్ట్ కొద్ది అంగుళాల దూరంలో ఆగిపోయింది. రనౌట్ అయ్యాడు. ధోనీ 350 మ్యాచ్ ఇలా భారంగా ముగిసింది. ధోనీ రనౌట్ అవగానే గ్యాలరీలు చాలామంది ఏడ్చేశారు. ఇక ధోనీ భార్య సాక్షి కళ్ల వెంట నీళ్లు ఆగలేదు. ధోనీ సైతం ఉద్వేగానికి లోనయ్యాడు. ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమైన దగ్గర్నుంచి అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఇలా ఘోర పరాజయం మూటగట్టుకోవడాన్ని క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదేమైనా ఆటలో గెలుపోటములు సహజమే. కాకపోతే విజయం సాధిస్తామన్న గట్టి నమ్మకం వున్నప్పుడు ఇలా జరిగినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం.