గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 30 మే 2019 (15:32 IST)

భావోద్వేగానికి గురైన విజయమ్మ... అమ్మ కన్నీరు తుడిచిన జగన్

తన కుమారుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లో ఆయన తల్లి వైఎస్. విజయమ్మ భావోద్వేగానికి లోనై కన్నీరు కార్చారు. దీంతో జగన్ తల్లి విజయమ్మ కన్నీరు తుడిచారు. ఈ దృశ్యం టీవీల్లో పదేపదే చూపిస్తున్నారు. 
 
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం స్వీకారం చేయించారు. 
 
ఆ తర్వాత అనంతరం జగన్ రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. ప్రసంగం ముగిసిన వెంటనే జగన్ రెండు చేతులు జోడించి అందరికీ నమస్కారం పెడుతుండడాన్ని చూసి తల్లి విజయమ్మ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. జగన్ మాట్లాడుతున్నంతసేపు పట్టి ఉంచిన కన్నీటిని ఆపుకోలేక ఒక్కసారిగా జగన్‌‌ను హత్తుకుని ఏడ్చేశారు. 
 
అదేసమయంలో కార్యక్రమానికి హాజరైన ప్రజానీకం కూడా సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తిస్తుండగా, జగన్ తల్లి కన్నీళ్లను తుడిచి అతిథులను సాగనంపుదాం రామ్మా అంటూ తోడ్కొని వెళ్లారు. సభలో అప్పటివరకు కనిపించిన ఆవేశపూరిత వాతావరణంలో విజయమ్మ చూపించిన పుత్రవాత్సల్యం అందరి కళ్లను చెమర్చేలా చేసింది. అసలైన పుత్రోత్సాహం విజయమ్మతో కనిపించింది.