శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (22:45 IST)

జూబ్లీహిల్స్‌లో దారుణం: 14 ఏళ్ల మైనర్ బాలుడితో లైంగిక వాంఛలు తీర్చుకున్న మేనత్త

జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల వయస్సు గల మేనల్లుడి మీద లైంగిక వాంఛలు తీర్చుకున్నది 33 ఏళ్ల మేనత్త. ఆ కార్యాన్ని ప్రియుడి సాయంతో వీడియో రికార్డింగ్ తీసింది.
 
ఆ వీడియోను అడ్డుపెట్టుకుని బాలుడికి బెదిరింపులు చేయడం మొదలుపెట్టింది. డబ్బు, నగలు తేవాలని కోరింది. దాంతో అతడు భయంతో తల్లికి చెందిన 20 తులాల ఆభరణాలను మేనత్తకు ఇచ్చాడు. రూ.6 లక్షల నగదు, ఆభరణాలు కనిపించకపోవడంతో కొడుకును నిలదీసింది తల్లి. 
 
విషయం బయటపడటంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి. మేనత్త పైన పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.