శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (19:29 IST)

కైకాలకు అవ‌య‌వాలు స‌హ‌క‌రించ‌డంలేదు: డాక్ట‌ర్లు బులిటెన్ విడుద‌ల‌

Kaikala Satyanarayana
న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్య ప‌రిస్థితి స‌రిగ్గా లేద‌నీ డాక్ట‌ర్లు ధృవీక‌రించారు. శ‌నివారం ఉద‌యం 7.30గంట‌ల‌కు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రిలో కైకాల‌ను కుటుంబీకులు జాయిన్ చేశారు. అప్ప‌టికే ఆయ‌న‌ కోవిడ్‌కు గుర‌యి కోలుకున్నార‌నీ, త‌ర్వాత ఆయ‌న‌కు శ్వాస‌కోశ సంబంధ స‌మ‌స్య‌లు తలెత్తాయ‌ని శనివారం రాత్రి డాక్ట‌ర్లు విడుద‌ల‌ చేసిన బులెటెన్‌లో పేర్కొన్నారు.
 
కైకాల‌గారు మూత్ర సంబంధిత స‌మ‌స్య‌ల‌తోనూ బాఢ‌ప‌డుతున్న‌ట్లు తెలిపారు. కొన్ని అవ‌య‌వాలు స‌హ‌క‌రించ‌డంలేద‌ని పేర్కొన్నారు. వైద్యబృందం అత‌ని ప‌రిస్థితి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్షిస్తుంద‌ని వెల్ల‌డించారు. అతని పరిస్థితిని సరిచేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పరిస్థితి చాలా క్లిష్టమైనది. ఆశించిన ఫలితం చాలా తక్కువగా ఉంది అని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.