గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 22 అక్టోబరు 2021 (20:26 IST)

ఇంజినీరింగ్ విద్యార్థినిని పొదల్లోకి లాక్కెళ్లి....

ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసారు కొందరు గుర్తు తెలియని యువకులు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తాడికొండ మండలం లోని మోతడకలో ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తన స్నేహితులతో కలిసి రాత్రివేళ గుంటూరుకి వెళ్తోంది.

 
మధ్యలో కొందరు గుర్తు తెలియని యువకులు వారిపై కర్రలతో దాడి చేసి వాహనాలను ఆపివేసారు. ఆ తర్వాత యువతిని సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచార యత్నం చేసారు. దీనితో యువతితో పాటు ఆమె స్నేహితుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

 
తమపై అత్యాచార యత్నం జరిగిందని బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.