బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 24 జనవరి 2022 (22:45 IST)

సైబర్ మోసం ద్వారా బ్యాంకుకే కన్నం వేసిన కేటుగాళ్లు: రూ. 12 కోట్లు హాంఫట్

ప్రజల బ్యాంకు ఖాతాలను సైబర్ కేటుగాళ్లు మోసం చేసారన్న వార్తలను మనం చూస్తుంటాం. కానీ తాజాగా హైదరాబాద్ సైబర్ మోసగాళ్లు ఏకంగా బ్యాంకుకే సైబర్ కన్నం వేసారు. బ్యాంకులో వున్న రూ. 12 కోట్లను నిమిషాల్లో మాయం చేసారు.


వివరాల్లోకి వెళితే... హైదరాబాదులోని మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాక్ అయ్యింది. తేరుకునేలోపే మెయిన్ సర్వర్ హ్యాక్ చేసిన మోసగాళ్లు ఏకంగా బ్యాంకు నుంచి రూ. 12 కోట్లు కొల్లగొట్టారు. అక్కడి నుంచి మొత్తం 100 వేర్వేరు బ్యాంకులకు ట్రాన్సఫర్ చేసుకున్నారు. దీనితో బ్యాంక్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.