సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (08:21 IST)

హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు

హైదరాబాద్ నగర వాసుల ప్రయాణ అవసరాలు తీర్చే ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను సోమవారం రద్దు చేశారు. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతులు వంటి సమస్యల కారణంగా పలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. సోమవారం ఒక్క రోజే ఏకంగా 36 సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. వీటితో విశాఖపట్టణం - నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలను సైతం రద్దు చేసినట్టు తెలిపింది. 
 
కాగా, సోమవారం రద్దు చేసిన ఎంఎంటీఎస్ సర్వీసుల వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ - లిగంగంపల్లిల మధ్య నడిచే 18 రైళ్లు, ఫలక్‌నుమా - లింగంపల్లిల మధ్య నడిచే 16 సర్వీసులు, సికింద్రాబాద్ - లింగంపల్లిల మధ్య నడిచే 2 సర్వీసులు, విశాఖపట్టణం - నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసినట్టు తెలిపింది.