శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (16:19 IST)

లోకల్ ట్రైనులో 20 యేళ్ళ యువతిపై అత్యాచారం.. ఎక్కడ?

victim
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. మూవింగ్ ట్రైనులో 20 యేళ్ల యువతిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిర్గౌన్ ప్రాంతానికి చెందిన 20 యేళ్ల యువతి పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి  వెళ్లేందుకు రైలు సీఎస్ఎంటీ వద్దకు హార్బర్ లైను లోకల్ ట్రైనులో ఎక్కింది. లేడీస్ కంపార్ట్‌మెంటులోకి 40 యేళ్ల ఓ వ్యక్తి ఎక్కాడు. 
 
ఆ సమయంలో కంపార్టుమెంటులో ఒక్కరూ లేరు. ఇంతలో ఆ ట్రైన్ బయలుదేరడంతో ఆ వ్యక్తి ఆ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో మస్జీద్ స్టేషన్ వద్ద రైలు దూకి పారిపోయాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు నిందితుడి కోసం ముంబైలో గాలించి చివరకు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతనిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.