శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (16:39 IST)

అత్తను హత్య చేసిన అల్లుడు.. కారణం ఏంటో తెలుసా?

murder
రోజురోజుకీ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. పిఠాపురంలో అత్తను ఓ అల్లుడు హత్య చేశాడు. కుటుంబ కలహాల కారణంగా అత్తపై కత్తితో దాడి చేసి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ, పిఠాపురంకు చెందిన అత్త గండేపల్లి రమణమ్మ, రమేష్ అత్తాఅల్లుళ్లు. ఈ నేపథ్యంలో అత్త గండేపల్లి రమణమ్మపై అల్లుడు రమేష్ కత్తి‌తో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అత్త రమణమ్మ అక్కడక్కడే మృతి చెందారు.

 
అడ్డుకునేందుకు ప్రయత్నించిన మామ, బావమరిదిలకు గాయాలు అయ్యాయి. చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్తను హత్య చేసి రమేష్.. తన కొడుకుని తీసుకుని వెళ్లిపోయి, పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.