శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (11:42 IST)

చిత్తూరులో ఇంటర్ విద్యార్థిని అత్యాచారం.. హత్య... జట్టు కత్తిరించి... కళ్లు పీకేసి...

murder
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అత్యాచారం చేసి... జట్టు కత్తిరించి, కళ్లు పీకి చంపేసి ఆపై మృతదేహాన్ని బావిలో పడేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
చిత్తూరు జిల్లా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన మునికృష్ణ పద్మావతి అనే దంపతులకు భవ్యశ్రీ అనే కుమార్తె ఉంది. ఈమె ఇంటర్  విద్యాభ్యాసం చదువుతుంది. ఈ యువతిని ముగ్గురు యువకులు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆ యువతికి మాయమాటలు చెప్పి... ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత వెంట్రుకలు కత్తిరించి, ఆపై హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేశారు. 
 
దీనిపై మృతురాలి తల్లిదండ్రులు స్పందిస్తూ, ఈ నెల 17వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన తమ కుమార్తె ఇంటికి తిరిగిరాలేదు. మూడు రోజుల తర్వాత గ్రామ సమీపంలోని బావిలో మృతదేహం కనిపించింది. ఆమెను మండలానికి చెందిన ముగ్గురు యువకులు ప్రేమ పేరుతో వేదింపులకు గురిచేస్తూ వచ్చారని, ఈ క్రమంలో వారే మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి అనంతరం అత్యాచారం చేసి, చంపేసి, కళ్లు పీకి, జుట్టు కత్తిరించి, మృతదేహాన్ని బావిలో పడేశారు. వినాయక నిమజ్జనం కోసం 20వ తేదీన కొందరు బావి వద్దకు వెళ్లగా మృతదేహం కనిపించింది. 
 
ఆభరణాలను చూసి మునికృష్ణ, పద్మావతి... తమ కుమార్తెను గుర్తించారు. ఆమె అదృశ్యంపై 18నే పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు మాత్రం స్పందించలేదని వారు సకాలంలో స్పందించివుంటే తమ కుమార్తె బతికి ఉండేదని వారు ఆరోపించారు. శవ పరీక్ష నివేదికలనూ తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. మృతురాలి తలపై జుట్టు ఏమైందని తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ప్రశ్నించారు.