ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (13:31 IST)

పెళ్లయిన కొద్దిసేపటికే వరుడి కోసం వచ్చిన పోలీసులు, ఎందుకంటే?

పెళ్ళయ్యింది. శోభనానికి నూతన వధూవరులిద్దరినీ పంపించారు. సరిగ్గా గంట సమయం అయ్యింది. ఉన్నట్లుండి పోలీసులు ప్రత్యక్షం. నూతన వధూవరులు ఉన్న గదిలోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. తలుపులు గట్టిగా కొడుతూ కనిపించారు. దీంతో బంధువులు అక్కడకు చేరుకుని పోలీసులతో గొడవకు దిగారు. పోలీసులు చెప్పిన మాటలు విని బంధువులు షాకయ్యారు.

 
బీహార్‌కు చెందిన శ్రవణ్ కుమార్ ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడు. బెయిల్ పై వచ్చి వివాహం చేసుకున్నాడు. బెయిల్ పై వచ్చిన కొన్నిరోజులకు అతను మరో గొడవ చేసి కేసులో ఇరుక్కున్నాడు. అయితే పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. సొంత అక్క కుమార్తెనే రహస్యంగా పెళ్ళి చేసుకున్నాడు.

 
తమ్ముడే కదా అని అక్క దయతలచి పెళ్ళి చేసింది. కానీ శోభనానికి పంపిన వెంటనే పోలీసులు వచ్చేశారు. మద్యలో శోభనం ఆగిపోయింది. నూతన వధూవరులిద్దరూ బయటకు వచ్చేశారు. శ్రవణ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 
అరెస్టు వారెంట్ ఉందని చూపించారు. అయితే రేపు ఉదయం తీసుకెళ్ళండి.. ఈరోజు వాళ్ళ శోభనమంటూ బంధువులు ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. అసలు ఏం జరుగుతుందో తెలియక నూతన వధువు నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోయింది.