నాకు ఎయిడ్స్ వుంది... ప్లీజ్ నన్ను కౌగలించుకోరూ... 16 ఏళ్ల అమ్మాయి...

ఎయిడ్స్... ఈ వ్యాధి వస్తే ఇక మరణమే. ఐతే దీన్ని నిరోధించేందుకు మందులు కనిపెట్టారు. కాగా ఈ వ్యాధి సోకినవారిని తోటివారు ఎంతమాత్రం ఆదరించేందుకు ముందుకు రారు. ఎయిడ్స్ వ్యాధి వున్నదని తేలితే స్వయంగా కుటుంబ సభ్యులే వారిని వెలివేసే సంఘటనలు చాలా వున్నాయి. కొన

girl-AIDS
ivr| Last Modified శుక్రవారం, 27 జులై 2018 (14:46 IST)
ఎయిడ్స్... ఈ వ్యాధి వస్తే ఇక మరణమే. ఐతే దీన్ని నిరోధించేందుకు మందులు కనిపెట్టారు. కాగా ఈ వ్యాధి సోకినవారిని తోటివారు ఎంతమాత్రం ఆదరించేందుకు ముందుకు రారు. ఎయిడ్స్ వ్యాధి వున్నదని తేలితే స్వయంగా కుటుంబ సభ్యులే వారిని వెలివేసే సంఘటనలు చాలా వున్నాయి. కొన్నిచోట్ల కుటుంబ సభ్యులు ఆదరించినా ఊర్లో వుండేవారు కుటుంబాన్ని మొత్తాన్ని వెలివేసిన దాఖలాలున్నాయి. 
 
ఐతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతో జీవించినప్పటికీ మిగిలిన వ్యక్తులకు అది ఎట్టి పరిస్థితుల్లోనూ సోకదు. అది అంటురోగం కానేకాదు. ఐనప్పటికీ సమాజంలో వున్న అనుమానం కారణంగా ఎయిడ్స్ సోకినవారు తీవ్రమైన నిరాదరణకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో ఎయిడ్స్ రోగికి షేక్‌హ్యాండ్ ఇచ్చినా, వారితో కలిసి తిరిగినా ఎయిడ్స్ సోకదని చెప్పడం కోసం ఓ వినూత్న ప్రయత్నం చేసింది అజిమా అనే 16 ఏళ్ల వయసున్న ఉజ్బెకిస్తాన్ అమ్మాయి.
 
ఆమె ఏం చేసిందంటే... నాకు ఎయిడ్స్ ఉంది... ప్లీజ్ నన్ను కౌగిలించుకోరూ.. అంటూ ఓ ప్లకార్డ్ పట్టుకొని రోడ్డు మీద నిలబడింది. ఆ అమ్మాయిని, పక్కనే ప్లకార్డును చూసినవారు ఆమెను ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. నీకేమీ కాదులే అంటూ భుజం తట్టారు. ఇపుడా వీడియోను యూనిసెఫ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది. 
 
ఈ సందర్భంగా ఆ బాలిక మాట్లాడుతూ... తను పదేళ్ల నుంచి ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. అందరిలాగే తను కూడా జీవితాన్ని ఆనందంగా గడపాలనీ, ఎయిడ్స్ వ్యాధి వున్నవారు కూడా మిగిలినవారిలో హాయిగా సమాజంలో జీవించవచ్చని తెలిపేందుకే తను ఈ ప్రయత్నం చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. తను చేసిన విన్నపానికి ఊహించని రీతిలో స్పందన వచ్చిందనీ, తనను ఆలింగనం చేసుకున్నవారు తన కుటుంబ సభ్యుల్లా తనకు ధైర్యం చెపుతుంటే ఎంతో సంతోషమేసిందని వెల్లడించింది. 
 
ఎయిడ్స్ వ్యాధి కౌగలించుకోవడం వల్ల కానీ, కలిసి నిద్రపోయినా, కలిసి భోజనం చేసినా సోకదు. ఐతే ఇది కేవలం రక్తం ద్వారా, అసురక్షితమైన శృంగారం, తల్లి నుంచి బిడ్డకు మాత్రమే సోకుతుందన్నది తెలిసిన విషయమే. ఇన్ని తెలిసినా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు అనగానే అతడితో మాట్లాడేందుకు జంకుతుంటారు చాలామంది. ఈ ధోరణి మారాలి అనేందుకే ఆ బాలిక ఈ వీడియోను షేర్ చేసింది.దీనిపై మరింత చదవండి :