Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య... నిజం రాస్తే పాయింట్ బ్లాంక్ మర్డర్లే...

బుధవారం, 6 సెప్టెంబరు 2017 (18:07 IST)

Widgets Magazine
journalist

బెంగళూరులో ఒకే టైపు హత్యలు. అప్పుడు ప్రముఖ రచయిత కల్బుర్గీ, ఇప్పుడు సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య. తుపాకులతో పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. వీరి చేసింది నిజాలను నిర్భయంగా రాయడమే. అదే వారి ప్రాణాల మీదికి తెచ్చింది. వివరాల్లోకి వెళితే... మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బెంగళూరులో గౌరీ లంకేష్ తన ఇంటి గేటు తీస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌లపై వచ్చి ఆమెపై పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరిపారు. తూటాలు ఆమె మెడ, ఛాతీ భాగాల్లో దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. 
 
అయితే, గౌరీ లంకేశ్ ఇంటి ముందు అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్ ఇప్పుడు పోలీసుల ముందు సవాలుగా నిలిచింది. ఆమె తన ఇంట్లో అమర్చుకున్న సీసీటీవీలకు ఓ పాస్ వర్డ్‌ను పెట్టుకుని ఉండటమే ఇందుకు కారణం. నిందితుల వివరాలు ఈ కెమెరాల్లో రికార్డు అయి ఉంటాయని స్పష్టం చేసిన పోలీసులు, ఇప్పుడా పాస్ వర్డ్‌ను ఛేదించే పనిలో పడ్డారు. 
 
ఆ పాస్‌వర్డ్ ఆమెకు మాత్రమే తెలుసునని వెల్లడించిన సిట్ అధికారులు, రాష్ట్ర సైబర్ నిపుణులు వీడియోలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ ప్రక్రియ పూర్తయితే, ఎంతమంది హత్యలో పాల్గొన్నారన్న విషయం తేటతెల్లమవుతుందని అంటున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ విచారణకు అత్యంత కీలకమని తెలిపారు.  
 
కాగా, ఈ హత్యను పలువురు నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం హిందుత్వ రాజకీయాలను విమర్శించినందుకే ఈమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మనీష్ సిసోడియాలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. "ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే.." వ్యాఖ్యానించారు. 
 
అలాగే, సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... "ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య వార్త విని షాకయ్యాను. ఈ దారుణాన్ని ఖండించడానికి మాటలు కూడా రావడం లేదు. వాస్తవానికి ఇది ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే. ఆమె మరణంతో కర్ణాటక ఓ బలమైన ప్రగతిశీల గళాన్ని కోల్పోయింది. నేను ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయాను.." అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అలాగే, గౌరీ లంకేశ్ హత్యోదంతంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'బెంగళూరు సహా పలుచోట్ల ఎందుకింత దారుణాలు చోటుచేసుకుంటున్నాయి? దీనిపై యడ్యూరప్ప నిరవధిక సత్యాగ్రహాన్ని చేపట్టాలి. లేకుంటే బెంగళూరు 1930ల నాటి చికాగో నగరంలా మారుతుంది...' అని ట్వీట్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. ఉజ్బెక్ మహిళపై కారులో గ్యాంగ్ రేప్

దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ తరహా ఘటన ఒకటి జరిగింది. ఉజ్బెకిస్థాన్ మహిళపై కారులో గ్యాంగ్ ...

news

ఉత్తర కొరియా అణు పరీక్ష... పైకెగిరిన కొండ... కంపించిన చైనా సరిహద్దు...

ఇటీవల ఉత్తర కొరియా నిర్వహించిన అణు పరీక్ష ధాటికి ఆ దేశంలోని పలు కొండచరియలు ...

news

హరికేన్ 'ఇర్మా'లో చిక్కుకున్న ఫ్లైట్ ... భయానక వీడియో

కరేబియన్ దీవులను హరికేన్ 'ఇర్మా' అతలాకుతలం చేస్తోంది. ఈ తుఫాను క్షణక్షణానికి ఉగ్రరూపం ...

news

గణేషుడుతో గొర్రె మాంసం ప్రమోషన్‌ (Video)

భారతీయ దేవతామూర్తులను ప్రాశ్చాత్యులు వివిధ రకాలుగా అవమానిస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ...

Widgets Magazine