Widgets Magazine

టిటిడి ఛైర్మన్ పదవి.. పుట్టా సుధాకర్‌కు పోయినట్లే.. ఎలాగో చూడండి...

గురువారం, 12 ఏప్రియల్ 2018 (14:57 IST)

అనేక వివాదాల నడుమ ఎట్టకేలకు టిటిడి ఛైర్మన్ పీఠం దక్కించుకున్నాడు పుట్టా సుధాకర్ యాదవ్. క్రిస్టియన్ సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయంటూ ఒకవైపు హిందూ ధార్మికవేత్తలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇంతకీ పుట్టా సుధాకర్ యాదవ్ క్రిస్టియానిటీకి మద్దతుగా ఉంటున్నారా.. టిటిడి ఛైర్మన్ పదవి దక్కించుకోవడం వెనుక జరిగిన లాబీయింగ్ ఏంటి... ఆయన్నే పెట్టాలని నిర్ణయించినప్పుడు ఇంతకాలం తటపటాయించడానికి గల కారణాలేంటి.. ఆయన పేరు ప్రకటించి రెండురోజులు కాకముందే అసలు ఆ పదవి నుంచే ఆయన్ను తొలగించాలన్న డిమాండ్ హిందూ ధార్మికవేత్తల నుంచి ప్రధానంగా వినపడుతోంది. 
Sudhakar
 
హిందూ ధర్మాన్ని ఎక్కువగా ఫాలో అయ్యే బిజెపి నాయకులు టిటిడిలో తమ ఆధిపత్యం ఉండాలని కోరుకుంటున్నారు. తాము చెప్పిన వారికే ఛైర్మన్ ఇవ్వాలంటూ చంద్రబాబుకు అనేక సిఫారసులు చేశారు. బిజెపితో మెరుగైన సంబంధం కోసం పాకులాడుతున్న చంద్రబాబు టిటిడి ఛైర్మన్ పదవిని ఆ పార్టీ చెప్పిన వారికి ఇవ్వడం ద్వారా బిజెపికి మరింత దగ్గరవ్వాలనుకున్నారు. అయితే అందుకోసమే పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ఫైనల్ అయినప్పటికీ ప్రకటించడానికి తలపటాయిస్తూ వచ్చారు. చివరకు బిజెపితో బంధం విడిపోవడంతో ఇక చంద్రబాబుకు ఫ్రీగా నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడింది. దీంతో తన మనిషిగా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్‌కు ఆ పదవి ఫైనల్ అయ్యింది. 
 
పుట్టా సుధాకర్ యాదవ్‌కు టిటిడి ఛైర్మన్ పదవి ఫైనల్ కావడంతో హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. క్రిస్టియన్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ అలాంటి వ్యక్తికి ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ హిందూ ధార్మికవేత్తలు ఆందోళనలు చేస్తున్నారు. టిటిడి ఛైర్మన్‌ పదవికి పుట్టాను నియమించడానికి ఈ ఆందోళన కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే హిందూ ధార్మిక సంఘాల ఆందోళన చేసినా ఏ మాత్రం పట్టించుకోకుండా పుట్టాకే పదవిని ఇవ్వడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ సమయంలో బిజెపి కూడా టిటిడిపై విమర్శలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుట్టాను ఆ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో హిందూ ధార్మిక సంఘాలు పోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. వేలాదిమంది హిందువులను కలుపుకుని తిరుపతిలో ఒక సభను ఏర్పాటు చేసి ఇతర మతాలకు సహకారం అందించే వ్యక్తులను టిటిడిలోని నామినేటెడ్ పోస్టులలో నియమించకూడదని హిందూ ధార్మికవేత్తలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళనున్నాయి. ఇదే కానీ జరిగితే ప్రమాణ స్వీకారం కాకముందే పుట్టాను ఆ పదవి నుంచి తొలగించడం ఖాయమని అనుకుంటున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తాజ్‌మహల్‌ను షాజహాన్ ఆ బోర్డుకు రాసిచ్చారా? మినార్ కూలిపోయిందా?

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను నిర్మించిన మొఘలాయ చక్రవర్తి షాజహాన్ తమకు ...

news

పదో తరగతి ప్రేమ.. బలవంతంగా లైంగిక దాడి.. పెళ్లి కూడా రద్దు..

పదో తరగతిలో ప్రేమ పేరిట ఓ యువతిని ఓ దుర్మార్గుడు లొంగదీసుకున్నాడు. అలాగే లైంగికంగా ...

news

దేశంలో శాంతి పరిరక్షణకు కట్టుబడివున్నాం : ప్రధాని నరేంద్ర మోడీ

దేశ ప్రజలను, భూభాగాన్ని కాపాడటానికి ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నామో, దేశంలో శాంతి ...

news

అల్జీరియాలో కుప్పకూలిన మిలటరీ విమానం.. 257 మంది సజీవదహనం

అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతి చెందారు. ...