శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By selvi
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (12:20 IST)

అమరావతికి మకాం మార్చనున్న జగన్.. ఇల్లు, పార్టీ కార్యాలయం ఎక్కడంటే?

హైదరాబాద్ నుంచి అమరావతికి వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి మకాం మార్చనున్నారు. వైకాపాకు సంబంధించిన కార్య‌క‌లాపాల‌న్నీ హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోని కేంద్ర కార్యాల‌యం నుండే కొన‌సాగుతున్నాయి. ఇకపై పార్టీ కార

హైదరాబాద్ నుంచి అమరావతికి వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి మకాం మార్చనున్నారు. వైకాపాకు సంబంధించిన కార్య‌క‌లాపాల‌న్నీ హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోని కేంద్ర కార్యాల‌యం నుండే కొన‌సాగుతున్నాయి. ఇకపై పార్టీ కార్యకలాపాలను అమరావతి కేంద్రంగానే నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో అమరావతిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా జగన్ కార్యాచరణ మొదలు పెట్టారు. 
 
ఎన్నిక‌ల సందర్భంగా పార్టీ స‌మావేశాలు అక్క‌డే నిర్వ‌హించ‌డంతో పాటు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అమ‌రావ‌తిలోనే అందుబాటులో ఉండాల‌ని భావిస్తున్నారు. పాదయాత్ర పూర్తయ్యే నాటికి కార్యాలయ శాశ్వత నిర్మాణాలు పూర్తిచేయాలని జగన్ కార్యకర్తలకు కచ్చితమైన ఆదేశాలిచ్చారు. 
 
ఈ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలో వైసీపీ పార్టీ కార్యాల‌య భ‌వ‌నం నిర్మాణం వేగంగా జ‌రుగుతోంది. అమ‌రావ‌తి రాజ‌ధానికి, స‌చివాల‌యం, అసెంబ్లీకి కేవ‌లం పది కిలోమీట‌ర్ల దూరంలోనే ఈ నిర్మాణాలు జ‌రుగుతున్నాయి. పార్టీ కార్యాల‌యంతో పాటు జ‌గ‌న్ ఇంటి నిర్మాణ ప‌నులు పార్టీ నేత ఘట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రుగుతున్నాయి.
 
హైద‌రాబాద్ లోట‌స్ పాండ్‌లో భ‌వ‌నాల మాదిరిగానే అమ‌రావ‌తిలోనూ నివాసం, పార్టీ కార్యాల‌యాల‌ను ప‌క్క‌ప‌క్క‌న వ‌చ్చే విధంగా డిజైన్ చేశారు. సువిశాల‌మైన ప్ర‌దేశంలో ఈ నిర్మాణాలు జ‌ర‌గుతున్నాయి. ప్రస్తుతం పాదయాత్రలో 3వేల కిలోమీటర్లు జగన్ పూర్తి చేశారు. ఈ యాత్ర విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పాదయాత్ర న‌వంబ‌ర్ చివ‌రి నాటికి పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ ఏడో తేదీన లేదంటే జగన్ పుట్టిన రోజు డిసెంబర్ 21వ కానీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు.