Widgets Magazine

రజినీ, కమల్ హాసన్‌లు ఇద్దరూ అందుకు పనికిరారట....

శుక్రవారం, 18 మే 2018 (21:05 IST)

జయలలిత మరణం తరువాత తమిళనాట జరుగుతున్న రాజకీయ పరిణామాలు యావగింపు కలిగిస్తున్నాయి. అధికార అన్నాడిఎంకే ముఖ్యమంత్రి పీఠం కోసం తన్నులాడుకున్న తీరు, కేంద్రం తెరవైపు నుంచి బొమ్మలను ఆడించిన వైనం, ఇప్పటికీ మోడీ చెప్పినట్లు తలూపుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల తీరు… ఇవన్నీ దేశ వ్యాపితంగా తమిళనాడును పలచన చేశాయి. ఈ క్రమంలోనే సినీనటులు కమల్‌ హాసన్‌, రజీనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశం చేయడంతో తమిళ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ ఇద్దరి మధ్య పొత్తు వుంటుందా ఉండదా అనేది ఇంకా తేలాల్సివుంది. తమ రాజకీయాలు వేరేవేరని కమల్‌ హాసన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.
rajini - kamal
 
అన్నింటికన్నా ముఖ్యం రజనీకాంత్‌ ఇంకా పార్టీ పేరు వెల్లడించలేదు. దానికీ మూహూర్తం వస్తుందంటున్నారుగానీ ఎప్పుడొస్తుందో ఇంకా చెప్పలేదు. అయితే ఆయన రాక తమకు ప్రమాదమని తెలుసుకున్న అధికార పార్టీ రజనీపై దాడి మొదలుపెట్టింది. రజనీకాంత్‌కు తమిళనాడులోని 234 స్థానాల్లో కనీసం 150 స్థానాల్లో ప్రభావం చూపగల శక్తి వుందని ఓ సర్వేలో తేలిందట. అప్పటి నుంచి అధికార పార్టీ దాడి మొదలుపెట్టింది. రజనీకాంత్‌ను తక్కువ చేసి చూపడానికి….’ వర్షం పడితే మొలచిన పుట్టగొడుగులు. త్వరలోనే కనిపించకుండాపోతుంది’ అని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి విజయకుమార్‌ వ్యాఖ్యానించారు. పుట్టగొడుగు జీవితకాలం కొన్ని గంటలు మాత్రమే. చిన్నపాటి ఎండకు కూడా అది వాడిపోతుంది. 
 
రజనీ పెట్టబోయే పార్టీ కూడా అంతే అనేది ఆయన మాటల సారాంశం. ఈ విధంగా తక్కువ చేయడం ద్వారా ఎవరై ఆ పార్టీ వైపు వెళ్లకుండా చేయడం ఆ మంత్రిగారి ఉద్దేశం కావచ్చుగానీ… ప్రభుత్వం పోయాక ఈ మంత్రిగారైనా అన్నాడిఎంకేలో ఉంటారా? అనేది ప్రశ్న. ఇటు రజనీ పార్టీకైనా, అటు కమల్‌ పార్టీకైనా, ప్రతిపక్షంలోని డిఎంకే పార్టీకైనా మొదలుగా వలసలు మొదలయ్యేది అన్నాడిఎంకే నుంచే. ప్రస్తుతం ఆ పార్టీని మోడీ వెనుక వుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు ఆ రాష్ట్రంలో ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తమిళ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సి వుంది.
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కారు నుంచి రోడ్డుపై దిగిన శ్రీరెడ్డి... షాక్ అయిన ఆందోళనకారులు... ఎందుకు?

శ్రీరెడ్డి పేరు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ ...

news

భోపాల్‌లో మరో నిర్భయ: రహస్య భాగాల నుంచి బీర్, కూల్‌డ్రింక్స్ బాటిళ్లు

నిర్భయ తరహాలో భోపాల్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భోపాల్‌లో 28 ఏళ్ల మహిళ దారుణంగా ...

news

చెన్నై నుంచి విజయవాడకు వెళ్లాడు... ఆ తర్వాత మిస్... ఫోన్ స్విచాఫ్...

చెన్నై నుంచి తన సొంత ఊరుకి బయలుదేరిన నల్లగంటి సోమయ్య అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. చెన్నై ...

news

ఉత్తర ఇంగ్లండ్‍‌లో భారత సంతతి మహిళను.. వెంటాడి మరీ చంపేశాడు?

ఉత్తర ఇంగ్లండ్‌లో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురైంది. ఉత్తర ఇంగ్లండ్‌లోని మిడిల్స్ బరో ...

Widgets Magazine