Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రజనీకాంత్‌ కత్తికి రెండు వైపులా పదును... వ్యూహాత్మక అడుగులు

సోమవారం, 14 మే 2018 (15:01 IST)

Widgets Magazine

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఇప్పటికే రజనీ మక్కల్ మండ్రం పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి, తద్వారా ప్రజా సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరం చేశారు. అదేసమయంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
rajini
 
దీనిపై రాజకీయ విశ్లేషకులు కూడా తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల మద్దతు కోసం రజనీకాంత్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల చెన్నై మదురవాయల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో జరిగిన ఎంజీఆర్‌ విగ్రహావిష్కరణలో పాల్గొన్న రజనీకాంత్‌ 'ఎంజీఆర్‌ తరహాలో సుపరిపాలనను అందిస్తాన'ని వ్యాఖ్యానించారు. దీని ద్వారా అన్నాడీఎంకే కార్యకర్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 
 
ఆ తర్వాత తాజాగా నగరంలో జరిగిన 'కాలా' ఆడియో ఆవిష్కరణ వేడుకల్లో రజనీ మాట్లాడుతూ.. 'శివాజి' విజయోత్సవంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తనను ప్రశంసిస్తూ మాట్లాడారని, ఆయన స్వరం మళ్లీ వినాలని ఆసక్తితో ఉన్నట్టు తెలిపారు. దీని ద్వారా తనకు కరుణానిధి వ్యతిరేకి కాదనే సంకేతాలు కూడా పంపారు. డీఎంకేలో స్టాలిన్‌ నాయకత్వాన్ని అంగీకరించని వారిని తాను ప్రారంభించనున్న పార్టీలోకి ఆహ్వానించడం కోసమే రజనీకాంత్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 
 
ముఖ్యంగా, రాష్ట్రంలో జయలలిత మరణం, కరుణానిధి అనారోగ్యం కారణంగా ఏర్పడిన రాజకీయ శూన్యతను ఖచ్చితంగా భర్తీ చేయగలనని రజనీకాంత్‌ విశ్వసిస్తున్నారని సమాచారం. దీని కోసం అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని తెలిసింది. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే శ్రేణులను ఏమాత్రం నొప్పించకుండా ఆయన తన కత్తికి రెండు వైపులా పదును ఉందన్న రీతిలో ముందుకు సాగదు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కన్నాకు పదవి... 'కమలం'లో కుమ్ములాటలు... అజ్ఞాతంలోకి సోము వీర్రాజు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ...

news

రోజురోజుకీ ముదురుతోన్న వ‌ర్ల రామ‌య్య వివాదం... విద్యార్థి తల్లి ఆవేదన(video)

ఏపీఎస్ ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య ఓ విద్యార్థిని కులం పేరుతో తిట్ట‌డం.. నీకు చ‌దువు ఏం ...

news

ఆ తాబేలుకి 186 ఏళ్లు... కానీ శృంగారంలో ప్రతిరోజూ చాలా దృఢంగా....

తాబేలు ఆయుర్దాయం 200 ఏళ్లకు పైగా వుంటుందని చెపుతుంటారు. అనుకున్నట్లే ఓ తాబేలుకి 186 ...

news

ఇంపాజిబుల్ అనే పదంలోనే ఐయాం పాజిబుల్ అనే అర్థం వుంది: జేడీ

''ఇంపాజిబుల్'' అనే పదంలోనే ఐయాం పాజిబుల్ అనే అర్థం వుందని.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ...

Widgets Magazine