వచ్చే 2019 ఎన్నికల్లోను నగరి ఎమ్మెల్యేగా రోజానే.. ఎలాగంటే..?

శనివారం, 7 జులై 2018 (15:03 IST)

ఫైర్ బ్రాండ్ రోజాకు వచ్చే ఎన్నికల్లో తిరుగేలేదా..? నగరి ఎమ్మెల్యేగా రోజా మరోసారి గెలవడం ఖాయమా..? నగరి నియోజకవర్గంలో ప్రజలు రోజా వెంటే ఉన్నారా.. ఎలాగో చూద్దాం..
 
రోజా. ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మొదట్లో సినీ నటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు రోజా. రాజకీయంగా మొదటగా తెలుగుదేశం పార్టీలో ఉన్నా అందులో ఇమడలేక ఆ తరువాత వై.ఎస్.ఆర్. కుమారుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.ఎస్.ఆర్.సి.పి.లో చేరారు రోజా. నగరి నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచారు. 
Roja
 
రాజకీయాల్లో అప్పటికే తలపండిన సీనియర్ నేత గాలి ముద్దుక్రిష్ణమనాయుడుతో ఎన్నికల్లో ఢీకొన్నారు. అనూహ్యంగా ముద్దుక్రిష్ణమనాయుడును ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలోను అడుగుపెట్టారు. ఎన్నో వివాదాల మధ్య అసెంబ్లీలో బహిష్కరణకు గురయ్యారు రోజా. రాజకీయంగా ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్న రోజా అధికార తెలుగుదేశంపార్టీ నేతలను తనదైన శైలిలో విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఎన్నోసార్లు రోజా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. తన సొంత నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్థి కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. 
 
చిత్తూరుజిల్లా తాను పుట్టిన ప్రాంతమయినా పుత్తూరు నియోజకవర్గం మాత్రం రోజాకు కొత్తే. అయితే ఎమ్మెల్యే అయిన తరువాత ప్రజలందరికీ బాగా దగ్గరయ్యే ప్రయత్నంలో విజయం సాధించారు రోజా. వైసిపి కార్యకర్తలు, నాయకులకు ఎలాంటి సమస్య ఉన్నా వాటిని కూడా పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇలా నగరి నియోజకవర్గంలో అటు వైసిపి నేతలకు, ఇటు ప్రజలకు బాగా దగ్గరయ్యారు. 
 
వచ్చే ఎన్నికల్లో రోజా గెలవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే రోజాకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పుత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులెవరో ఇప్పటివరకు పార్టీనే తేల్చుకోలేని పరిస్థితి. గాలి ముద్దుక్రిష్ణమనాయుడు మరణం తరువాత ఆయన పదవిని కుటుంబ సభ్యులకే ఇవ్వాలని చంద్రబాబు భావించారు. ముద్దు కుమారులు గాలి జగదీష్‌, గాలి భానులలో ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలనుకున్నారు. అయితే అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం... ఎమ్మెల్సీ సీటు ఇద్దరూ కోరుకోవడంతో చివరకు చంద్రబాబు ముద్దుక్రిష్ణమనాయుడు సతీమణి గాలి సరస్వతమ్మకు ఇచ్చారు. 
 
ఎమ్మెల్సీ సీటు ముద్దుక్రిష్ణమనాయుడు సతీమణికి ఇచ్చినా అన్నదమ్ముల మధ్య మాత్రం గొడవలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయన్న ప్రచారం జరుగుతూనే ఉంది. అందుకు ప్రధాన కారణం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ సీటు కోసమేనని తెలుస్తోంది. ఎలాగైనా ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవాలని ఒకవైపు గాలి జగదీష్‌, మరోవైపు గాలి భాను ఇద్దరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఇక ఎమ్మెల్యే సీటును గాలి కుటుంబానికి ఇవ్వాలన్న ఆలోచనలో మాత్రం లేదట. 
 
ఎవరో ఒక కొత్త ముఖాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చంద్రబాబునాయుడు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఖచ్చితంగా రోజాకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ గాలి ముద్దుక్రిష్ణమనాయుడు సోదరుల్లో ఎవరో ఒకరికి పార్టీ సీటిచ్చినా వారిలో ఎవరికీ పెద్దగా రాజకీయ అనుభవం లేకపోవడంతో అది కూడా రోజాకు బాగా కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఎటొచ్చీ నగరిలో రోజాకు ఇక తిరుగులేదని అంటున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇకపై అలా చేస్తే సెల్‌ఫోన్ సీజ్... తిక్క కుదురుతుంది...

ఎన్నిసార్లు చెప్పాలి.. ఎన్నిసార్లు ఫైన్స్ వేయాలి.. ఎంత మందికి అని జరిమానాలు విధించాలి. ...

news

పెళ్లిలో భార్య డ్యాన్స్ చేసిందనీ..

పెళ్లిలో డ్యాన్స్ చేసిందనే కారణంతో అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను అత్యంత దారుణంగా ...

news

తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్.. టీచర్లు... విద్యార్థుల అత్యాచారం

ఆటవిక పాలనకు నిదర్శనంగా చెప్పుకునే బీహార్‌లో మరో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదివే ...

news

సునందా పుష్కర్ మృతి కేసు : శశిథరూర్‌కు బెయిల్

సునందా పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు ...