Widgets Magazine

ఆస్తి గొడవలే 'అతిలోక సుందరి' శ్రీదేవి మృతికి కారణమా?

మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (08:05 IST)

Widgets Magazine
sridevi deadbody

బాలీవుడ్ అతిలోకసుందరి శ్రీదేవిని మృతిపై వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె మరణం వెనుక మిస్టరీ దాగివుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఆమె ఆస్తి గొడవలకే బలయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది.  
 
దుబాయ్‌లో అభిజ్ఞవర్గాల సమాచారం మేరకు... మోహిత్‌ మార్వా- బోనీ కపూర్‌ మొదటి భార్య మోనా తరపు బంధువు. మోనా 2012లోనే చనిపోయింది.. కానీ ఈ పెళ్లికి ఆమె తరపు వారంతా తరలి వచ్చారు. శ్రీదేవి కూడా భర్తను, చిన్న కూతురు ఖుషీని తీసుకెళ్లి పాల్గొంది.
 
అయితే పెళ్లిలో బోనీకపూర్‌ ఎక్కువగా వారితోనూ, మోనా పిల్లలు అర్జున్‌ కపూర్‌, అన్షులాలతో గడపడం శ్రీదేవికి నచ్చలేదు. ఆ విషయమే ఆమె బోనీని ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి బోనీ సూటిగా బదులివ్వలేకపోయారు గానీ ఈ విషయం చిలికి చిలికి గాలివానలా మారినట్టు సమాచారం. 
 
ఆస్తిలో సగభాగం మొదటి భార్య సంతానానికి కూడా చెందితే తన బిడ్డల గతేం కాను అని శ్రీదేవి చాలా ఆందోళనపడ్డట్లు తెలుస్తోంది. 
తొలి భార్య పిల్లలతో బోనీ సఖ్యతపై శ్రీదేవి చాలా ఆగ్రహంగా స్పందించినట్లు, ఇది పెళ్లినాటి ప్రమాణాలకు విరుద్ధమని ఆమె గట్టిగా చెప్పినట్లూ తెలుస్తోంది.
 
బోనీ - మళ్లీ అర్జున్‌ వైపు చూస్తుండడంతో ఆమెకు కొత్త సమస్య మొదలయ్యింది. ఒక పక్క జాహ్నవిని మంచి నటిగా నిలబెట్టాలని తాను తాపత్రయపడుతూంటే బోనీ మాత్రం తన పుత్రరత్నం వైపు మనసు పెట్టడం ఆమెలో కల్లోలాన్ని రేపింది. తెగ మథనపడిపోయింది. 
 
బోనీకి ఏమీ లేని స్థితిలో ఆమె ఆయనను పెళ్లి చేసుకుని తన ఆస్తినంతా ఆయన పరం చేసి జీవితం గడుపుతూ వచ్చింది. ఓ రకంగా ఇన్నేళ్లూ బోనీ అనుభవిస్తున్నదంతా శ్రీదేవి సంపాదించిన ఆస్తే. ఇపుడా ఆస్తిని బోనీ- తన తొలి భార్య పిల్లలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోడానికి శ్రీదేవి ఇష్టపడడం లేదు. జాహ్నవి, ఖుషీల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలని ఆరాటపడింది. జాహ్నవి తొలి సినిమా ధడక్‌ ను ఖరారు చేసి సెట్స్‌ దాకా తీసికెళ్లింది కూడా శ్రీదేవే.
 
ఆమె దుబాయ్‌లో ఉండిపోయిన కారణం .. మారుతున్న బోనీ వైఖరి గురించి ఆలోచించడానికేనని తెలుస్తోంది. ఆ తర్వాత దుబాయ్ నుంచి ముంబైకు వచ్చి... మళ్లీ భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు దుబాయ్ వెళ్లిన బోనీ కపూర్ నిజంగానే శ్రీదేవికే కాదు యావత్ ప్రపంచానికి తేరుకోలేని సర్‌ప్రైజ్ ఇచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శ్రీదేవి వైన్ మాత్రమే తీసుకుంటారు.. ఢిల్లీ పత్రికల ఓవరాక్షన్..

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి మృతిపట్ల ఫోరెన్సిక్ రిపోర్ట్ విడుదలైంది. ఈ రిపోర్టులో ...

news

లైవ్‌లో గొడవ పెట్టుకున్న పాకిస్థాన్ యాంకర్లు.. వీడియో వైరల్

ఇద్దరు పాకిస్థాన్ యాంకర్లు లైవ్‌లో గొడవపెట్టుకున్నారు. ఆ లైవ్ కోట్లాది మంది ప్రజలు ...

news

గోవా ముఖ్యమంత్రి పారికర్ ఆరోగ్యంపై ఆందోళనక్కర్లేదు...

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన గోవా ...

news

ఉద్యోగం ఇప్పిస్తానని రేప్ చేశాడు.. పలువురిచే లైంగిక దాడి చేయించాడు..?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దుస్తుల కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లిన యువతిపై ...