శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (13:26 IST)

అమ్మనీయమ్మ.. సర్వే చేస్తే.. షాక్ కొట్టిందేంటి..? వైకాపా గెలుపు ఖాయమా?

ఏపీ ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయోనని ఆరాటం కొద్దీ నందిగామకు చెందిన ఓ టీడీపీ నేత సొంతంగా సర్వే చేయించుకున్నారని టాక్ వస్తోంది. 2019 ఎన్నకలే కాదండోయ్.. 2014లో కూడా ఇదే జరిగిందట. ఆ ఎన్నికల ఫలితాలపై జరిపిన సర్వేలో రిపోర్ట్ టీడీపీకి అనుకూలంగా వచ్చింది. 
 
ఇక తాజాగా చేయించిన సర్వేతో మాత్రం టీడీపీ నేతకు షాక్ కొట్టింది. ఈ సర్వేలో టీడీపీకి 58 సీట్లు సాధిస్తుందని రిపోర్ట్ వచ్చింది. అంతే సదరు నేత కంగారు పడ్డారని తెలిసింది. ఇందుకు కారణం అదే సర్వేలో వైసీపీకి మాగ్జిమం 105 స్థానాలు వస్తాయని తేలడమే. 
 
ఈ సర్వే రిపోర్ట్‌తో రానున్న ఫలితాలు వైకాపాకు అనుకూలంగా వుంటాయని టీడీపీ టెన్షన్ పడుతుందట. అంతటితో ఆగలేదు. ఇన్నాళ్లూ... తమకు సీట్లు తగ్గినా... జనసేన ద్వారా పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావచ్చనే అంచనాల్లో ఉన్న ఆ నేత... తన సర్వే రిపోర్టులో జనసేనకు 3 సీట్లు మాత్రమే వస్తాయని తేలడంతో మరింత ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
 
ఏపీలో మొత్తం 175 స్థానాలు ఉండగా, మ్యాజిక్ మార్కు 88. కాబట్టి ఆయనెవరో టీడీపీ నేత సర్వే ప్రకారం చూస్తే.. వైకాపాకే సానుకూల పవనాలు వీస్తున్నాయని తేలిపోయిందట. అదన్నమాట సంగతి.