ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (11:31 IST)

నేడు క్యాన్సర్ డే.. వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఏం చేస్తారు?

క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 4 న ప్రపంచ క్యాన్సర్ రోజుగా గుర్తిస్తారు. ప్రపంచ క్యాన్సర్ దినం యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC)చే ప్రారంభించింది. 2008లో వ్రాసిన వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ యొక్క లక్ష్యాలకు మద్దతుగా ఉంది. 2020 నాటికి క్యాన్సర్ వల్ల అనారోగ్యం, మరణం గణనీయంగా తగ్గించటమే దీనిలక్ష్యం. 
 
యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (యుఐసిసి) నేతృత్వంలో ప్రతీ ఏడాది ఫిబ్రవరి 4న క్యాన్సర్ డేని జరుపుకుంటాం. మనుషుల ప్రాణాల్ని తీసే ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ మానవ వ్యాధి. ఈ వ్యాధి బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
క్యాన్సర్ సోకిన బాధితుల శరీరంలో క్యాన్సర్ కణాల్ని అరికట్టడం చాలా కష్టం. వయస్సుతో సంబంధం లేకుండా అందరికి సోకుతుంది. అయితే క్యాన్సర్‌ను నయం చేయోచ్చా అంటే ఖచ్చితంగా చేయోచ్చు. కాకపోతే క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించాలి. లేదంటే ఆ వ్యాధితో ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. 
 
ఇటీవల ఎయిడ్స్, క్షయ, మలేరియా, క్యాన్సర్ పై జరిగిన అధ్యయనంలో ఇతర వ్యాధుల కంటే క్యాన్సర్ సోకిన ప్రతీ ఆరుగురిలో ఒకరు చనిపోతున్నట్లు తేలింది. అందుకే క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (యుఐసిసి) కృషి చేస్తోంది. 
 
2000 సంవత్సరంలో పారిస్‌లో ఫస్ట్ వరల్డ్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్‌లో క్యాన్సర్ సోకకుండా, క్యాన్సర్ సోకిన బాధితులు మరణించకుండా ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంగా వరల్డ్ క్యాన్సర్ డే ని ఫిబ్రవరి 4నిర్ణయించారు. అదే సమ్మిట్‌లో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (యుఐసిసి)ను స్థాపించారు.
 
ఈ క్యాన్సర్ డే రోజున ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలనే సంబంధంలేకుండా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో పాల్గొనే ప్రతీఒక్కరికి క్యాన్సర్ ప్రభావం, దాన్ని ఎలా తగ్గించుకోవాలి. అసలు క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఇదే ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే ముఖ్య ఉద్దేశంగా ఉంది.