సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:20 IST)

కేంద్ర బడ్జెట్.. హైదరాబాదులో భారీగా తగ్గిన పసిడి ధరలు

కేంద్ర బడ్జెట్‌ ఎఫెక్ట్‌ కారణంగా దేశంలో బంగారం ధరలు ఆమాంతం పడిపోయాయి. దేశీయంగా బంగారం వినియోగం పెరిగినప్పటికీ ధరలు మాత్రం కాస్త తగ్గాయి. మంగళవారం హైదరాబాద్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 310 తగ్గి రూ. 45,500 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 తగ్గి రూ.49,640కి చేరింది. బంగారం ధరలు పడిపోగా.. వెండి ధరలు మాత్రం పెరిగిపోయాయి. 
 
కిలో వెండి ఏకంగా రూ. 4600 పెరిగి రూ.79200కి చేరుకుంది. కాగా, బడ్జెట్‌లో బంగారం, వెండిపై దిగుమతులపై సుంకాన్ని తగ్గిస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
 
హైదరాబాద్‌లో బంగారు రేట్లు ప్రపంచ బంగారు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇవి ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలచే ప్రభావితమవుతాయి.