మంగళవారం, 21 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (13:04 IST)

దీపావళి రోజున దీపాలను నదుల్లో వదిలేస్తే..?

Diwali
దీపావళి నాడు లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుందని విశ్వాసం. అందుకే దీపాలను వెలిగించడం ద్వారా శ్రీలక్ష్మిని ప్రసన్నం చేసుకోవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. దీపావళి రోజున దీపాలను వెలిగించడం ద్వారా ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి,శ్రేయస్సు లభిస్తుంది. దీపావళి తర్వాత మీరు వెలిగించిన దీపాలను నదిలో లేదా ప్రవహించే నీటిలో వదిలేయాలి. అయితే చాలామంది ఇంట్లో అనేక దీపాలను కూడా ఉంచుతారు. 
 
ఇది తప్పు. నిజానికి పాత దీపం ఇంట్లో నెగిటివిటీ ఎనర్జీని పెంచుతుంది. అందుకే దీపావళి తర్వాత వాటిని నదుల్లో వదిలేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
దీపావళి తర్వాత నదిలో దీపాలు వెలిగించాలంటే ఇదే కారణం. దీపావళి సందర్భంగా వెలిగించిన దీపాలను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. దీనితో శుభ ఫలాలను పొందవచ్చు. జీవితంలో ఎల్లప్పుడూ ఆనందాన్ని పొందవచ్చు.