శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సిహెచ్
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (09:51 IST)

ఇల్లు అలా ఉంటే లక్ష్మీ దేవి ఇంట్లోకి ఎలా వస్తుంది? ఇలా చేస్తేనే అమ్మ అడుగుపెడుతుంది

సహజంగా లక్ష్మిదేవి శుభ్రంగా ఉండే చోటే నివసిస్తుందట. ఇల్లు శుభ్రంగా, మనసు పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో అసలు రోదించకూడదు. వంటగది కూడా శుభ్రంగా ఉండాలి. ఎంగిలి గిన్నెలు, కంచాలు లాంటివి రాత్రిపూట అలాగే వదిలి వేయకూడదు. ఇంట్లో ఎక్కువ సేపు నిద్రపోవటం, ముఖ్యంగా సంధ్యవేళ నిద్రపోవటం లాంటివి చేయకూడదు. అంతేకాదు నిత్య దీపారాధన కూడా చేయాలి. 
 
కూర్మం(తాబేలు) ప్రతిమని ఓ చిన్న ప్లేటులో ఉంచి నీరు పోసి ఈశాన్య భాగాన పెట్టడం, తామర వత్తులతో దీపారాధన లాంటివి చేయటం వలన కూడా దారిద్ర్యం మన దరిచేరదు. తామర వత్తులతో ఆరు బయట గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి పడమర దిక్కున కూడా ఉంచవచ్చు. ఈ దీపారాధన అసురసంధ్య వేళ చేయాలి. తామర వత్తి దీపాలు వెలిగించాలి. 
 
సన్నని వత్తులు 13 తీసుకొని వాటిని పేని ఒకే వత్తి లాగా చేసుకోవాలి. ఇలా 8 వత్తులు చేసుకోవాలి. అంటే మొత్తం 13×8 వత్తులు ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక్కో వత్తిని తీసుకొని రెండు చివరలు కలపాలి. అంటే సున్నాలా ఉంచుకోవాలి, ఇలా మిగిలిన 7 వత్తులను కూడా అలానే చేసి పద్మంలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక తామర వత్తి అవుతుంది. ఇలా రెండు చేసుకొని రెండు ప్రమిదల్లో ఉంచి దీపారాధన చేసుకోవాలి. ఇలా చేస్తే దరిద్రం దరి చేరదు.