శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (18:33 IST)

నరకచతుర్దశినాడు.. ఏ దిశలో దీపం వెలిగించాలి?

నరకచతుర్దశినాడు.. దక్షిణ దిక్కుకేసి దీపాలను వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దక్షిణం యమస్థానం, కాబట్టి యమలోకం కూడా అటువైపే ఉందని చెబుతారు. యమలోకంలో ఉన్న మన పితృదేవతలకు ఈ దీపం దారిని చూపిస్తుందని విశ్వాసం. ఎవరైతే ఇలా దీపాలను వెలిగిస్తారో వారు తమ పితృదేవతలను నరకలోకం నుంచి స్వర్గాన్ని చేరవేర్చినవారవుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
దీపావళి ప్రేతచతుర్దశి అనే పేరు కూడా వుంది. అందుకే పితృదేవతలను పూజించే దిశగా దక్షిణం వైపు దీపమెట్టాలని పండితులు చెప్తున్నారు. ఏ స్థాయిలో వున్నా.. నరకచతుర్దశి నాడు తమ పితృదేవతలను మనస్ఫూర్తిగా తలుచుకునే అవకాశమే ఈ దక్షిణ దీపమని వారు అంటున్నారు. 
 
నరకచతుర్దశినాడు చేసుకునే పిండివంటలలో నువ్వులు కూడా చేర్చుకోవడం ముఖ్యం. నువ్వుల శరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. చలికాలం మొదలవుతున్న ఈ సమయంలో నువ్వులతో కూడిన ఆహారపదార్థాలు, శరీరాన్ని చలికి సిద్ధంగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి.