శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By Selvi
Last Updated : సోమవారం, 9 నవంబరు 2015 (20:11 IST)

దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేస్తే ఫలితం ఏమిటి?

లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. శుభ్రంగా కళకళలాడే ఇంట లక్ష్మీదేవి నివాసముంటుంది. అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రమయ్యే సరికి ప్రమిదల దీపాలు, లేదంటే, రంగురంగుల బల్బులు కల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణలు చేస్తారు. 
 
ఇక దీపావళి పూజలో ప్రధానంగా వినాయకుడిని, మాత లక్ష్మీ దేవిని పూజించాలని పురోహితులు అంటున్నారు. ఏ పూజ చేసినా విఘ్నఅధిపతి అయిన వినాయకుడిని ముందుగా పూజించాలి. దీని తర్వాత లక్ష్మీ దేవిని ఆమె మూడు రూపాలయిన లక్ష్మీ, సరస్వతి, మహా కాళి, రూపాలలో పూజిస్తారు. వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. దీపావళి నాడు లక్ష్మీ గణపతులను పూజిస్తారు.
 
లక్ష్మీదేవి రూపం గణపతితో పాటు వుంటుంది. అందుచేత తాము నిర్వహించే కార్యాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని సిరులిచ్చే తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలావుండాలని కోరుకుంటూ దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేస్తారు. మీరు కూడా లక్ష్మీగణపతులను పూజ చేసి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.