Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దీపావళి: ఆ మూడు రోజుల్లో దీపదానం చేస్తే?

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (14:57 IST)

Widgets Magazine

దీపావళికి ముందు రోజు నరకచతుర్దశి.. అంతకుముందు ధనత్రయోదశిని ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాతి రోజున బలిపాడ్యమిగా కొన్నిచోట్ల జరుపుకుంటారు. కార్తీశుద్ధ పాడ్యమినే బలిపాడ్యమిగా జరుపుకుంటారు. బలి చక్రవర్తిని మించిన దానశూరులుండరు అంటారు.

వజ్ర, వైఢూర్యాలు, మునిమాణిక్యాలు వంటివి దానమివ్వడంతో పాటు తనకు తానుగానే శత్రువుకు దానం ఇచ్చుకున్న వితరణ శీలి బలిచక్రవర్తి. ఆయన్ని దేశంలోని  కొన్ని ప్రాంతాల్లో పూజించడం ఆనవాయితీ. కేరళలో బలిచక్రవర్తి తమను పరిపాలించాడని నమ్మి, వారు తమ జాతీయ పర్వమైన ఓనంను బలి ప్రీత్యర్ధం జరుపుకుంటారు. 
 
దక్షిణభారతదేశంలో దీపావళి మూడునాళ్ళ పండుగగా జరుపుకుంటే, ఉత్తరభారతదేశంలో, మొత్తం ఐదు రోజులపాటు దీపావళిని జరుపుకోవడం పరిపాటి. సాధారణంగా ధనత్రయోదశి నాటి సాయంత్రం ఇంటి వెలుపల యముని కోసం దీపం వెలిగిస్తే అపమృత్యువు నశిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే, ధనత్రయోదశి, అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోషసమయాన దీపదానాన్ని చేస్తే, యమమార్గాధికారం నుంచి విముక్తుడు అవుతాడని విశ్వాసం. 
 
దీపోత్సవ చతుర్దశి రోజున యమతర్పణం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. హేమాద్రి అనే పండితుడు ఈ దీపోత్సవాన్ని "కౌముదీమహోత్సవం" అని నిర్వచించినట్లుగాను, నరకచతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి, దీపదానం చేయాలని చెప్పాడని వివరించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఉదయం 4.30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య దీపం వెలిగిస్తే....

దీపం వెలిగించడమంటే దేవుడిని ఆరాధించడమే. దీపారాధనను శాస్త్రోక్తంగా చేయాలి. అది దీపం ...

news

శిలా మూర్తికి శిరసా నమామి..!

తిరుమల క్షేత్రం... కలియుగ వైకుంఠం. తిరుమల కొండల్లోని చెట్టూ, పుట్టా... రాయీ, రప్ప... ఆ ...

news

కాకి ఇంటి ముందు గట్టిగా అరిస్తే మంచిదే...

కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం. జంతువులు, పక్షులు హిందూ సాంప్రదాయంతో అనేక ...

news

స్వామీ... మా ప్రభుత్వాన్ని కాపాడంటున్న పన్నీర్ సెల్వం (Video)

తిరుమల శ్రీవారిని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ...

Widgets Magazine