గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:13 IST)

కాఫీ కప్పుపై ఆమె పెదాల మరకలే.. .ఏం చేయాలి?

ప్రతిరోజూ అధిక సమయం మనం గడిపేది ఆఫీసులోనే. అందుకే ఆఫీసులో ఉన్నంతసేపు తాజాగా, అందంగా కనిపించాలని కోరుకుంటాం. అందుకు కొన్ని మేకప్ చిట్కాలు ఉన్నాయి. అవి పాటిస్తే చాలు..
 
1. వర్క్ ప్లేస్‌లో చేతివేళ్ల గోళ్లు శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఫ్రెంచి మానిక్యూర్ చేయించుకుంటే.. బాగుంటుంది. లేదా పీచ్, పేస్టల్ షేడ్స్‌లో ఉండే నెయిల్ ఎనామిల్ వాడొచ్చు.
 
2. కళ్లు ఆకర్షణీయంగా కనిపించడానికి మస్కారా బయటకు కారకుండా కళ్లకు కొద్దిగానే రాసుకోవాలి. డ్రమెటిక్ స్మోకీ ఐలుక్స్‌తో ఆఫీసుకు వస్తే బాగుండదు. పార్టీ నుండి నేరుగా ఆఫీసుకు వచ్చినట్టు కనిపిస్తారు.
 
3. వర్క్ ప్లేసులో పెదాలు మెరుస్తున్నట్టు ఉండకూడదు. అందుకే అవి మృదువుగా కనిపించేలా చూసుకోవాలి. పెదాలపై బ్రిక్ అండ్ బెర్రీ రెడ్స్ అస్సలే అప్లై చేయొద్దు. వీటిని పెదాలకు రాసుకోవడం వలన కాఫీ కప్పులపై మరకలు పడ్డమే కాదు చూసేవారికి ఇబ్బందిగా ఉంటుంది.
 
4. మేకప్ చేసుకునేటప్పుడు సహజసిద్ధమైన రోజీ బ్లష్ వాడితే బాగుంటుంది. నేచురల్ రోజీ షేడ్‌ను చెంపల మీద అప్లై చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్కువ కలర్‌ను చెంపలపై అప్లై చేయొద్దు.